న్యూస్ హెల్త్

Grapes: ద్రాక్ష పండ్ల గురించి మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకుని తీరాలిసిందే..!!

Share

ద్రాక్ష పండు పేరు వింటే చాలు ఎవరికయినా సరే నోట్లో నీళ్లు ఊరతాయి. కాస్త తియ్యగా, మరి కాస్త పుల్లగా చూడడానికి నోరు ఊరించే పండు ద్రాక్ష పండు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ద్రాక్ష పండ్లు అంటే ఎంతో ఇష్టంగా తింటారు.ఇవి మనకు ఆకుప‌చ్చ‌, ఎరుపు, న‌లుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే అని చెప్పాలి. అయితే న‌ల్ల‌ద్రాక్ష‌ల‌ను తిన‌డం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Grapes:  నల్ల ద్రాక్ష ఉపయోగాలు :

Black grapesన‌ల్ల ద్రాక్ష‌ల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని అనేక వ్యాధుల‌ బారి నుండి మనల్ని కాపాడతాయి క‌నుక న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తినాలి. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరంలోని క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. ఫలితంగా క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.అంతేకాకుండా న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే పోష‌కాలు శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి కావున హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. న‌ల్ల ద్రాక్ష‌ల్లో ఉండే ఫైటో కెమిక‌ల్స్ గుండె కండ‌రాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పిల్లలు నల్ల ద్రాక్ష తింటే ఏమవుతుందో తెలుసుకోండి :

#image_titleఈ నల్ల ద్రాక్ష‌ల్లో విట‌మిన్ ఎ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.అందుకే నల్ల ద్రాక్ష తింటే కంటి చూపు కూడా మెరుగు పడుతుంది . మెద‌డును యాక్టివ్‌గా ఉంచడంలో నల్ల ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకు చదివింది గుర్తు ఉండాలన్న, జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరగాలి అంటే ప్రతిరోజు ద్రాక్ష‌ల‌ను పెట్టండి. అలాగే బరువు తగ్గాలని భావించే వారు ద్రాక్ష పండ్లు త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. అలాగే న‌ల్ల‌ ద్రాక్ష‌ల్లో ఉండే విట‌మిన్ సి శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
Share

Related posts

Food: ఆహారంలో భాగంగా రెడ్ వైన్ , చీజ్ తీసుకుంటే ఏమి జరుగుతోందో తెలుసా?

Kumar

బ్రేకింగ్: ఏపీ రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు

Vihari

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త..!! దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!

bharani jella