మనం నిత్యం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో మిరియాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.అందుకే మిరియాలను క్వీన్ ఆఫ్ ది స్పైసెస్ అనే పేరుతో పిలుస్తారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వలన వంటల యొక్క రుచి పెరగడంతోపాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.మిరియాలలో ఎన్నో రకాల పోషకాలతోపాటుగా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిత్యం వంటల్లో మిరియాలను వాడడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.మరి మిరియాల వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామా..
మిరియాల ఉపయోగాలు :
మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కావున మిరియాలను నేరుగా నమిలి తినగలిగిన వారు రోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు మిరియాలను నమిలి తినవచ్చు.ఇలా ప్రతిరోజు ఉదయం తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడంతో పాటుగా ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా రక్షించబడతారు..
మిరియాలను ఏవిధంగా తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం :
అజీర్తి సమస్యతో బాధపడే వారు మిరియాలను పాత బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.లేదంటే ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడిని వేసి కలిపి తీసుకున్న ఫలితం కనిపిస్తుంది.అలాగే చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి.తరచూ జలుబు, తుమ్ములు వంటి వాటితో బాధపడే వారు నీటిలో పసుపు, మిరియాల పొడి వేసి మరిగించి తాగితే జలుబు తగ్గుతుంది.చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు ఉన్న వారు మిరియాల పొడిని, ఉప్పుతో కలిపి చిగుళ్లపై రాసుకుంటే చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.అయితే మిరియాలను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది కదా అని వీటిని ఎక్కువగా తినకూడదు. అలాగే కడుపులో మంట, అధిక వేడితో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.