మనం నిత్యం వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వంటలకు రుచిను ఇవ్వడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తుంది ఈ వెల్లుల్లి. అలాగే వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ఇది మీ శరీరం నుండి అనేక రకాల వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది.వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా కూడా పని చేస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్ B1, B6 , C, మాంగనీస్ కాల్షియం, కాపర్, సెలీనియం మరియు ఇతర ముఖ్యమైన మూలకాలు కూడా ఉన్నాయి.అంతేకాకుండా ఎన్నో రకాల విటమిన్లు , పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.ఇవే కాకుండా వెల్లుల్లి వలన మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి వలన కలిగే ఉపయోగాలు :
వెల్లుల్లుని ఉపయోగించడం వలన ఉబ్బసం, జర్వం,నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ వ్యాధుల వంటివి నయం అవుతాయి.వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాత్రివేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని,నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది.వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని రాస్తే ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే?
వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుంది. జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. బరువు తగ్గాలని భావించే వారు సగం నిమ్మకాయ రసంలో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా బరువు తగ్గుతారు. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను తగ్గించి క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది.వెల్లుల్లిని తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నివారించటానికి తోడ్పడుతుంది.దంతసమస్యలను కూడా వెల్లుల్లి నయం చేస్తుంది. రోజూ మూడు వెల్లుల్లి పాయల్ని తీసుకుంటే జలుబు, అంటువ్యాధులు, ఉదరసంబంధిత వ్యాధులు దరిచేరవు.