మనం వంట చేయాలంటే ఏది ఉన్నా లేకున్నా ఉల్లిపాయ మాత్రం ఉండి తీరాలిసిందే.. ఉల్లిపాయ లేని కూర అసలు ఉహించుకోవడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఉల్లిపాయ ఒంటికి ఎంతగానో చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడంటే కాలం మారింది కానీ అప్పట్లో అయితే ఎంచక్కా మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ నంచుకుని తినేవారు. అలా తినబట్టే అప్పటి పెద్దవాళ్ళు ఇప్పటికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.
ఉల్లిపాయ ఉపయోగాలు :
ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి.ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఉల్లిపాయ ఎలా తినాలంటే?
ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.ఉల్లిగడ్డ ను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి