Health: చాలా మంది ఆకలికి కొద్ది సేపు కూడా ఆగలేరు. ఆకలి అయిన వెంటనే భోజనం అందుబాటులో లేకపోతే ఏదో ఒక తినుబండారాలను కొనుగోలు చేసుకుని ఆకలిని తీర్చుకుంటుంటారు. అయితే ఆకలి వేస్తుందని ఎదో ఒకటి కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఆకలి వేస్తున్న సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన కల్గి ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని కొన్ని సార్లు మనం కేలరీలు చాలా తక్కువగా ఉండే వాటిని తీసుకుంటూ ఉంటాం. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి మళ్లీ మనకు అయిదు నిమిషాల్లో ఆకలి వేస్తుంది.
Health: ఆకలి బాగా ఉన్నప్పుడు ఇవి తినకూడదు
నూడుల్స్, బిస్కెట్లు, వేపర్స్ తినకూడదు. జ్యూస్ మరియు షుగర్ ఎక్కువగా ఉండే ప్రొటీన్ బార్స్ తీసుకోకపోవడం ఉత్తమం. వీటికి బదులు ఆపిల్ తీసుకుంటే మంచిదనీ అది కడా పీనట్ బటర్ తో తీసుకుంటే మరింత మేలు అని చెబుతున్నారు. యాపిల్ తో పాటు పీనట్ బటర్ కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఆదే విధంగా ఆరు బాదంపప్పులతో పాటు మూడు ఖర్జూరం తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.
ఒక్కో సారి మనకి ఏమైనా స్వీట్ గా ఉండేవి తినాలని అనిపిస్తుంది. అటువంటి సమయాల్లో చాక్లెట్ బదులుగా నట్స్ తీసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా వేయించిన శనగలతో పాటు అటుకులు తీసుకోవడం కూడా మంచిదని అంటున్నారు.