Ears: పిల్లలు పుట్టిన తర్వాత జరిగే తంతులలో చెవులు కొట్టించడం కూడా చాలా ముఖ్యమైన అంశం అనే చెప్పాలి. అయితే చెవులు కుట్టించే ముందు తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని గుర్తు పెట్టుకోండి. పిల్లలకు చెవులు కుట్టించే ముందు కచ్చితంగా తలస్నానం చేయించాలి.ఆచెవులు కొట్టించిన తర్వాత ఒక వారం గడిచే వరకు మాత్రం చెవులపై చుక్క నీళ్ళు కూడా పడకుండా చూసుకుంటూ స్నానం ముగించాలి. చెవులకు అసలు నీటి చుక్కాఅనేది తగలకూడదు. స్టడ్స్ లేదా చిన్న చిన్న రింగులు లాంటివి కుట్టిస్తే నొప్పి లేకుండా ఉండడం తో పాటు చెవి రంధ్రం కూడా పెద్దవి అవుతాయి.
పిల్లలకు చెవులు కుట్టించిన తర్వాత రెండు మూడు రోజుల పాటు టీ షర్ట్, స్వెట్టర్స్ అలాంటి ఏమి .అవే కాదు తలపై నుంచి వేసే ఏ డ్రెస్ కూడా వేయకుండా ఉండడం మంచిది .
చేతులు తొడిగి గుండీలు పెట్టేవి అయితే అన్ని విధాలా మంచిది.అలాంటి బట్టలు వేయడం వలన అవి చెవుల దగ్గర పట్టేసి నొప్పి రావడం వంటివి లేకుండా ఉంటుంది. చిన్న పిల్లలకు చర్మం చాలా సున్నితంగా ఉండడం వలన వారికి చెవులు చీము పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దూదితో మృదువుగా తుడిచి కొబ్బరి నూనెతో నెమ్మదిగా మర్దన చేయడం వలన సమస్య తీవ్రమవకుండా ఉంటుంది.
మరీ పసిపిల్లలు అయితే వాళ్లకు తెలియకుండానే చెవులకు పెట్టిన వాటిని చిరాకుతో లాగేకుంటూ ఉంటారు. ఒకవేళ బలంగా లాగేసుకుంటే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే పిల్లల ను ఎత్తుకునే సమయంలో బుగ్గల మీద ముద్దు కూడా పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన మీ ముక్కు లేదా ముఖం వారి చెవులకు తగిలి వాళ్లకి నొప్పి రావడం తో పాటుగా దురద కలిగి చెవులకు ఉన్నవాటిని లాగేసుకుంటూ ఉంటారు.
పిల్లలు పడుకునే సమయంలో మెత్తని తలగడ వెయ్యాలి. అలా కాకపోతే పక్కకు తిరిగి పడుకున్నప్పుడు వాళ్ళకి నొప్పి రావడం తో పాటు బెడ్ షీట్ కి ఉన్న దారం లాంటివి చిక్కుకుని వాళ్ళు బలంగా లాగేసుకుంటే గాయం పెద్దది అవుతుంది. రాగి వి కుట్టిస్తే అది పడక పోతే చీము పడుతుంది. కాబట్టి వారికి పడే లోహాన్ని వాడితే మంచిది.