NewsOrbit
హెల్త్

health: పిరియడ్ సమయం లో ఇలా జరిగితే ప్రాణాలకు అపాయం అని తెలుసా??

health: సహజంగా  చాలామంది  స్త్రీలకు  నెలసరి సమస్య ఉంటుంది. ఆ  సమయానికి ముందే  రావడం లేదా ఆలస్యం అవడం ఎదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. దాన్ని ఆడవారు అసలు పట్టించుకోరు. ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది లే అని సరి పెట్టుకుంటారు. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయి  లే అని ఊరుకుంటారు.  నెలసరి  ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుంది.

అయితే అలా జరగడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని డాక్టర్స్ చెబుతున్నారు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. అందులో కొన్ని సంచలన అంశాలు తెలియచేయబడ్డాయి.కొన్ని పరిశోధనల లో తెలిసింది ఏమిటంటే చాలా నెలల పాటు నెలసరి లో   మార్పులు ఉంటే మాత్రం అది ప్రాణానికే ప్రమాదం అని తెలియ చేస్తున్నారు. నెలసరి  ఆలస్యం  అయ్యే వారికి గుండె జబ్బులు, ప్రాణాంతక వ్యాధులు వచ్చి చిన్న వయసులో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు  అని   తెలియ చేస్తున్నారు.  అది కేవలం లైంగిక వ్యాధి  మాత్రమే కాదని తెలియచేస్తున్నారు. అది ఎక్కువగా ప్రధాన జీవక్రియలను కుంటుపరిచే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్యకు ప్రధాన కారణం కూడా కావచ్చుని అని తెలియచేస్తున్నారు.

నెలసరి  సంబంధమైన ఏ సమస్యలు లేని వారితో పోలిస్తే, ఈ తేడాలు ఉన్నవారు ఎక్కువ సార్లు  పలు వ్యాధులతో సతమతమవుతున్నారు అని  ఈ సమస్య జీవిత కాలాన్ని తగ్గించేస్తుంది  అని  హెచ్చరిస్తున్నారు. కాబట్టి నెలసరి సమయం లో  మార్పులు వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్స్ ని  సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోక పొతే  మీ జీవితానికి ప్రమాదం తప్పదు. కాబట్టి ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దని  హెచ్చరిస్తున్నారు.చాలామంది  లో  ఈ నెలసరి  ఆలస్యమవడానికి  ప్రధాన కారణం ఒత్తిడి అనే చెప్పవచ్చు.

కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు  నెలసరి మొదలుకుని   మన శరీరంలో హార్మోన్ స్థాయి కూడా తగ్గిపోతుంటుంది. దీంతో సరైన సమయంలో అండం విడుదల జరగదు. దీంతో సరైన సమయానికి  నెలసరి  రాదు. అలాంటప్పుడు డాక్టర్ ను సలహాలు పాటించడం   , విశ్రాంతి తీసుకోవడం, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తిరిగి సక్రమమైన నెలసరి వచ్చేలా  చేసుకోవచ్చు. అయితే  ఇదంతా జరగడానికి  కొన్ని నెలలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri