NewsOrbit
హెల్త్

Curry Leaves : ఆకే కదా అని తేలికగా తీసుకోకండి… ఎందుకంటే ఇది కరివేపాకు..!!

Curry Leaves : మన భారతీయ వంటల్లో కరివేపాకుకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.కరివేపాకు యొక్క తాజా సువాసన కూరలకు కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే మన ఇళ్లల్లో వంట చేసేటప్పుడు కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.పచ్చడి తాలింపు దగ్గర నుండి సాంబార్ వరకు కరివేపాకు లేనిదే ఏదో వెలితి అలా కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది కూరల్లో కరివేపాకు కనిపించగానే దానిని ఏరిపారేసి పక్కన పడేస్తారు. కానీ అలా చేయడం మంచిది కాదు. వాస్తవానికి కరివేపాకును కేవలం కూరల్లో సువాసనకు కోసం మాత్రమే ఉపయోగిస్తాం అంటే పొరపాటు పడినట్లే ఎందుకంటే కరివేపాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Curry Leaves Tea: ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ తాగితే బరువు తగ్గుతారట..!!

Curry Leaves : కరివేపాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

కరివేపాకులోని యాంటి ఆక్సిడేంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అంతేకాకుండా కరివేపాకులో ఉండే టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఎన్నో రకాలయినా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అందుకే కరివేపాకును వంటల్లోనే కాకుండా ఔషదాల్లోనూ ఉపయోగిస్తారు.కరివేపాకు తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి చేయడం వంటి సమస్యలు ఉండవు. కాలిన గాయాలు, దురదలు, చర్మ సమస్యలను తగ్గించడానికి కరివేపాకు ఎంతగానో సహాయపడతాయి.

Curry Leaves: ప్రతిరోజూ పరగడుపున 4 కరివేపాకులు ఆకులను తింటే బోలెడు ప్రయోజనాలు..!!
కరివేపాకు తింటే బరువు తగ్గుతారా..?

బరువు తగ్గాలని భావించేవారు కరివేపాకును తింటే మంచిది ఎందుకు అంటే కరివేపాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గిస్తుంది. ఈ కాలంలో. చాలా మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ముందు జాగ్రత్త కోసం కరివేపాకు తింటే లుకేమియా,ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది. యూరిన్ సమస్యలనూ నివారిస్తుంది. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.పిల్లల్లో ఆకలి మందగిస్తే వేడి వేడి అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలకు ఆకలి పెరుగుతుంది.

Weight Loss: వాము, కరివేపాకుతో ఇలా ట్రై చేయండి.. బరువు తగ్గడం పక్కా..!!
జుట్టు ఒత్తుగా పెరగాలంటే?

మరి ముఖ్యంగా కరివేపాకును తినడం వలన జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు కూడా బాగా ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. కరివేపాకును ఎండపెట్టి పొడి చేసి దానిని కొబ్బరినూనెలో వేసుకుని తలకు పెట్టుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.అలాగే కరివేపాకు తినడం వలన ఎటువంటి చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

కరివేపాకు పొడి ఎలా చేయాలంటే..?

మరి కరివేపాకు పొడి ఎలా తయారుచేయాలో చూద్దామా. ముందుగా కరివేపాకును శుభ్రంగా నీటిలో కడిగి ఎండబెట్టాలి.ఆ తరువాత పెనం మీద వేసి సన్నని మంటపై వేయించాలి.అవి వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనెలో ఎండు మిరపకాయలనూ, కొద్దిగా ధనియాలను కూడా వేసి వేయించాలి. తరువాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించిన కరివేపాకు, ఎండుమిరపకాయలు,వెల్లుల్లి రిబ్బలు,చింతపండు, ధనియాలు,ఉప్పు,జీలకర్ర వేసి బాగా మెత్తగా పొడిలాగా వేసుకోవాలి.ఈ పొడిని ఒక సీసాలో వేసుకుని గట్టిగా మూటపెట్టుకుంటే వాసన పోకుండా ఉంటుంది.అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రెడీ అయినట్లే.. ఈ కరివేపాకు పొడిని వేడి,వేడి అన్నంలో గాని లేదంటే ఇడ్లీ, దోసలలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri