Health: చాలా మంది తమ తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం బిజీబిజీగా కాలం గడుపుతున్న యువతీ యువకులు చాలామంది రోజువారీ వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. కూర్చున్న చోట నుండి కదలకుండా విధులు నిర్వహిస్తూ ఉంటున్నారు. అస్సలు వ్యాయామం చేయకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ? ఎక్కువ రోజుల పాటు ఎక్సర్ సైజ్ చేయకుండా ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సరైన ఎక్స్ సైజ్ చేయకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పొట్ట రావడం కొవ్వు పెరగడం వల్ల సమస్యలు ఎదురవుతుంటాయి. షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం కూడా ఉంది. వారానికి ఒకటి రెండు వ్యాయామం చేయకపోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా కదలకుండా, చేతులు పైకి, కిందికి కదిలించకుండా ఉంటే చాలా తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.
మద్య పానం, ధూమ పానం, జంక్ ఫుడ్ లాంటివి శరీరానికి హానికరం. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం … క్రమం తప్పకుండా చురుకైన వ్యాయామం చేయడం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. సరైన స్థాయిలో శారీరక శ్రమ లేకపోవడం అనేది అకాల మరణం సంభవించే ప్రమాదాన్ని వేగవంతం చేస్తుంది. నిత్యం వ్యాయామం చేయడం వల్ల గుండెను చురుకుగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఏరోబిక్ చేసే హృదయ స్పందన రేటు పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా వ్యాయామం చేయకపోతే గుండె పని తీరు బలహీనంగా ఉండటం, రోజు వారీ పనులపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. హృదయ స్పందన కూడా దెబ్బతింటుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. గుండె సమస్యలు, కొలెస్ట్రరాల్ అధిక స్థాయిలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేయకపోతే కండరాల బలం తగ్గిపోతుంది. దీంతో శరీరం బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి అవసరమైన కదలికను సులభతరం చేసే మీ కండరాలలో ఎక్కువ భాగం దెబ్బ తింటుంది. సాధారణ బరువులు మోయడం కూడా కష్టంగా అనిపించవచ్చు. కండరాల పనితీరు శక్తివంతంగా లేదా మునుపటిలా సహాయకరంగా ఉండకపోవచ్చు. బలహీనమైన కండరాలు మీకు రోజువారీ పనులు చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది.
ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వ్యాయామం ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజులు చేయకపోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రరాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పెరగటం, ఎముకలు పెళుసుగా మారిపోవటం, బరువు పెరగటం, నిరాశ, నిస్పృహలు పెరిగిపోవటం, సహనం కోల్పోవటమే కాదు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అకాశాలుంటాయని అంటున్నారు. ఇటువంటి సమస్యలను దూరం చేసుకుని మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి శారీరక వ్యాయామం చాలా అవసరమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.