Health Tips | Snacks: చిరుతిళ్ళు తినడం ఈ రోజుల్లో చాల ఎక్కువైపోతోంది. 70 శాతం మంది ప్రతీ రోజు చిరుతిళ్ళు కనీసం రెండు సార్లైనా తింటున్నామని ఒక సర్వే లో చెప్పారు. మన భోజనాల మధ్య ఇలా చిరుతిళ్ళు తినేవారిలో మీరుకూడా ఉన్నారా? ఐతే మీరు కొంచం జాగ్రత్తగా ఉండాలి. అర్ధ రాత్రి ఎక్కువ ప్రాసెస్ చేయబడిన తిళ్ళు తినడం ఆరోగ్యానికి అంట మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. మనం ఎంత నాణ్యమైన ఆహరం తింటున్నామో ముఖ్యం గానీ ఎంత ఎప్పుడు తింటున్నామని కాదని కింగ్స్ కాలేజీ లండన్ లోని పరిశోధకులు అంటున్నారు. ఎక్కువ నాణ్యత కలిగినవి తినడం ఎక్కువ ప్రాసెస్ చేసినవాటికన్నా మంచివని చెబుతున్నారు. ఎప్పుడు తింటున్నాము అనేది చాలా ముఖ్యము. అర్ధ రాత్రి తినడం మంచిదికాదు. అర్ధ రాత్రి తినడం వలన శరీరం కొంచం కష్ట పడుతుంది.
ఒకప్పుడు ఇంటిలోనే తయారు చేసినవి మాత్రమే తినేవారు. అదీ పండగలకు, పెళ్ళిళ్ళ లాంటి సందర్భాలలోనూ తప్పితే మామూలు రోజుల్లో అంతగా తినేవారు కాదు. అయితే ఇప్పుడు రోజులో భోజనాలతో పాటుగా చిరుతిళ్ళు కూడా ఎక్కువగా వాడకం లోకి వచ్చాయి. ప్రస్తుతం జనం చాలా రకాల చిరుతిళ్ళకు అలవాటు పడ్డారు. కొన్ని ప్యాక్ చేసి ఉన్నవి ఆఫీసుల్లో, స్కూళ్ళకు వెళ్ళే బాక్సుల్లో, సులభంగా చేరిపోయాయి స్నాక్స్. సాయంకాలం పూట చిరు ఆకలిని తీర్చే స్నాక్స్‌కి ఉండాల్సిందే మరి. అయితే వీటిని రాత్రి పూట తినచ్చా.. అసలు ఎప్పుడు తీసుకోవాలి.

చాలా మంది ఆహారానికి బదులుగా స్నాక్స్ మాత్రమే తింటున్నారు. రాత్రిపూట పని చేస్తూ, టైంపాస్ చేసేందుకు స్నాక్స్ తింటారు. చిప్స్, లడ్డూలు, బిస్కెట్స్ వంటి స్నాక్స్ లాంటివి. ఆ చిరుతిళ్లన్నీ తినకూడదని న్యూట్రిషన్ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఇలా తింటే జీర్ణ సంబంధ సమస్యలతో పాటు, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. చిరుతిళ్ళను రాత్రిపూట ఆకలిగా ఉంటె అప్పుడపుడు కొద్ధి గా తీసుకోవచ్చు . తినకుండా ఉండడం ఉత్తమం. మిల్లెట్స్ తో చేసినవి, తేలికగా అరిగేవి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ ఫైబర్, కాల్షియం అందిస్తాయి. వీటిని వేయించి తినవచ్చు. రాగులు, జొన్నలు, మిల్లెట్ ఫాక్స్ నట్ వంటి ఉబ్బిన మిల్లెట్‌లను రాత్రిపూట కొంచం గా తినవచ్చని వైద్య పోషకాహార నిపుణుల మాట.
ప్యాకింగ్ స్నాక్స్ సాయంత్రం 9 గంటల తర్వాత తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
ఒడిదుడుకుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో.. ఏ టైంకి పడుకుంటున్నామో.. ఎవ్వరికీ తెలియట్లేదు. అందుకే లేట్ నైట్ డిన్నర్స్, అర్ధరాత్రి వేళ టిఫిన్లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇలాంటి అలవాట్లు మీ ఆరోగ్యం కొంపముంచుతాయి జాగ్రత్త అని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఊబకాయం, ఒబేసిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పలువురు నిపుణులు తాజాగా రాత్రిపూట అధికంగా తినేవారిపై ఓ అధ్యయనం చేపట్టారు. రాత్రుళ్లు అధికంగా తినడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు.
సాధారణంగా రాత్రుళ్లు జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఈ సమయంలో అధికంగా తింటే.. కడుపులో నొప్పి, ఛాతీలో మంట, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాత్రిపూట ఆహారం తినే అలవాటు మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.