ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health Tips: ఇవి పాటిస్తే అనారోగ్యం మీ చెంతకు రాదు..!!

Share

Health Tips: కరోనా మహామ్మారి వచ్చిన తరువాత ప్రజలు ఎక్కువగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. వైరస్ ను తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి బలోపేతం చేసుకుంటే చాలు ఒక వేళ కరోనా సోకినా పెద్దగా ఇబ్బంది ఉండదని గ్రహించారు. వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips follow these will not get sick
Health Tips follow these will not get sick

కోవిడ్ టీకా బూస్టర్ డోస్ తీసుకుంటే సామూహిక రోగ నిరోధక శక్తి లభిస్తుంది. దీని వల్ల జబ్బుల బారినపడటం తగ్గుతుంది. మనం ఇంట్లో ఎక్కువగా తాకే వస్తువులు అన్నీ తరచూ శుభ్రం చేసుకోవాలి. తరచు శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. ప్రధానంగా చక్కెర (షుగర్) ను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. మద్యం మాదిరిగానే షుగర్ కూడా తెల్లరక్తకణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. కావున చక్కెరను చాలా తక్కువగా తీసుకోవాలి. మహిళలు రోజుకు ఆరు స్పూన్లు, పురుషులు తొమ్మిది స్పూన్లు మించకుండా చూసుకోవాలి.

Health Tips: రోజు రాత్రి 8గంటల నిద్ర పోవాలి

పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పదార్ధాల వంటివి తీసుకోవాలి. ఇవి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. మంచి బ్యాక్టీరియా శరీరంలోని హనికర సూక్ష్మక్రిముల వృద్ధిని అరికడుతుంది. మద్యం అతిగా తీసుకుంటే తెల్లకర్తకణాల సామర్ధ్యం తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ పని తీరు మందగిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ లను ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. కావున మద్యం జోలికి వెళ్లకపోవడం మంచింది. గోళ్లు కొరికే అలవాటు ఉంటే మానివేయాలి. చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విటమిన్ డీ లోపం రాకుండా చూసుకోవాలి. రోజూ చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవడంతో పాటు పుట్టగొడుగులు, గుడ్డులోని సొన, చేపల వంటివి తినడం ఆరోగ్యానికి మంచిది. అవసరమైతే విటమిన్ డీ మాత్రలు వేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు, పప్పులు విధిగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఇది రోగ నిరోధక శక్తి సక్రమంగా పని చేయడానికి దోహదం చేస్తుంది. రోజు రాత్రి పూట కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి.


Share

Related posts

Devatha Serial: ఆదిత్య నిజం తెలుసుకుని దేవి మనసు మారుస్తాడా.!?

bharani jella

కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

Teja

Ravi teja: రెండు దశాబ్దాల క్రితం చేసిందే ఇప్పుడు మళ్ళీ చేయగలిగిన రవితేజ .. నువ్వు దేవుడివి సామీ !

GRK