health tips: యాలకుల తో కేవలం రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు.మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే గుణాలు యాలకులు కలిగి ఉన్నాయి . ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని పెంచుతాయి.జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం యాలకులకు ఎక్కువగా ఉంటుంది. గుండె పనితీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి యాలకుల్లో ఉండే పొటాషియం బాగా పనిచేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం తో పాటు ,డిప్రెషన్ విషయంలో యాలకులు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
యాలకులు వేసి కాచుకున్న టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి మాయమవుతుంది.యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉండి నోటి ఇన్ఫెక్షన్ రావు.యాలకులను తింటూ ఉండడం వలన ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజు నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే చాలా లాభాలు పొందవచ్చు .ప్రదానం గా శృంగార సమస్యలతో బాధపడేవారు పాలలో యాలకుల పొడిని కలుపుకుని తాగితే ఆ సమస్యలు తగ్గి ఉత్సాహంగా శృంగారం చేస్తారు. ఈ పాల వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది అనీ చాలా పరిశోధనల్లో బయట పడింది. చాలా మంది రాత్రి నిద్ర పట్టక బాధ పడుతుంటారు. వారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయ తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఇలా కొన్ని రోజులు చేస్తే నిద్రలేమి సమస్యలు తగ్గి హాయిగా నిద్రలోకి జారుకుంటారు.
దీనితో పాటు నిద్రలో గురక పెట్టే వారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యాలక్కాయలు తిని వేడి నీళ్లు తాగడం వల్ల అది ఒక ఔషధం లా పని చేసి నిదానంగా గురకకు తగ్గిస్తుంది. రోజూ ఇలా చేయడం వలన ఎముకలు బలం గా కూడా ఉంటాయి.
ఇలా చేయడం వలన ఇది చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా ఒత్తుగా ఉండేందుకు సహాయపడుతుంది .