Summer Tips, Health Tips: ఏప్రిల్ లో ఎండలు అదిరిపోతున్నాయి ఇంకా మే నెల కూడా రాలేదు కానీ సమ్మర్ హీట్ మాత్రం ఒంట్లో సెగలు పుట్టిస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే బయట తిరిగేవారికి సమ్మర్ డీహైడ్రేషన్(summer dehydretion) వలన వొచ్చే ఇక్కట్లు తప్పవు. అయితే వేడి నుంచి ఉపశమనం కోసం చిల్డ్ ఫ్రిడ్జ్ వాటర్(Chilled Water) మాత్రం తాగకండి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చల్లని ఐస్ వాటర్(Ice water) తాగడం వలన వొచ్చే హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో అర్ధం చేసుకుంటే ఇక మీరు చచ్చినా చిల్డ్ వాటర్ తాగరు.

Chematakayalu: చెమటకాయల నుంచి తక్షణ ఉపశమనం అందించే పాక్స్, జాగ్రత్తలు ఇదిగో..
కోల్డ్ స్ట్రెస్
సహజంగా మానవ శరీరము ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతను ఎప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండ అదుపు చేస్తుంది. మనుషులలో సగటు సాధారణ బాడీ టెంపరేచర్ 98.6F. హోమియోస్టాటిస్ లాంటి ప్రక్రియ ఎప్పుడు మనల్ని కాపాడుతూ శరీరం లోపడ నిలకడ వాతారణం ఉండేలా చేస్తుంది. అయితే గణాంకాలను పరిశీలించి చూస్తే కోల్డ్ స్ట్రెస్ రావాడిని ప్రధాన కారణాలలో అతిగా చిల్డ్ వాటర్ తాగడం అని తేలింది. ముఖ్యంగా బాగా వేడిగా ఉండే సమ్మర్ సీజన్లో ఐస్ కోల్డ్ చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వలన మీరు ‘కోల్డ్ స్ట్రెస్’ కి గురయ్యే అవకాశం ఉంది… ఈ సారి చిల్డ్ వాటర్ తాగేప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి.
హై బ్లడ్ ప్రెషర్: అధిక రక్త పోటు ఉన్నవారు చిల్డ్ వాటర్ తాగొచ్చా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు ఉన్నవారు చిల్డ్ వాటర్ తాగటం వలన రక్తం మందం అయి గుండెకు సంబంచించిన సమస్యలు ఎదుర్కోవాల్సిన అవకాశం ఎక్కువ.
చల్లటి నీళ్ల వల్ల జీర్ణక్రియ చెడతుందా
వేసవి లో వేడి తట్టుకోలేక చల్లటి నీళ్లు తాగితే మనకి పొట్ట చెడె అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు తెలుసుకున్న దాని ప్రకారం మనం బాగా చల్లగా అంటే ఐస్ కోల్డ్ వాటర్ తాగినప్పుడు గ్యాస్ట్రిక్ సంకోచాలు కాంట్రాక్షన్స్ చాలా తగ్గిపోతుందట. దీని వలన గ్యాస్ట్రిక్ మొటిలిటీ సమస్య వొచ్చి మీ జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంది.
చల్లటి నీటితో అచలాసియా సమస్య తప్పదు
బాగా చల్లటి నీరు తాగినప్పుడు అచలాసియా సమస్య కూడా వొచ్చే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అచలాసియా సమస్య వలన మనం తినే ఆహారం గింతులోనుంచి పొట్ట వరకు చేరుకోవటం కష్టంగా మారుతుంది దీని వలన మింగటం కష్టతరం అయ్యి, గొంతు నొప్పి ఇంకా ఛాతి నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.
ఇంతే కందండోయ్ చిల్డ్ వాటర్ తాగటం వలన తెల్ల రక్త కణాలు తగ్గిపోయి మానవ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చల్లటి నీటితో ఇంకా గొంతు, పళ్ళు, నరాలు ఇలాంటివి నొప్పి రావటం సహజం. చాలా మందికి తలనొప్పి రావడానికి కూడా చల్లటి నీరు కారణం అంట. అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఐస్ కోల్డ్ 2C వాటర్ గురించి. దాహం తీర్చుకోవటానికి చల్లని నీరు తాగాలి అని అనిపిస్తే మంచి మట్టి కుండ లో నీరు తాగండి లేదా ఒక పాత్రకి గుడ్డ కట్టి అందులో నీరు పోసి ప్రతి గంటకు ఒకసారి గుడ్డ తడపండి మీకు కావాల్సిన చల్లటి నీరు ఏ భయం లేకుండా ఇలా తాగొచ్చు.
Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం