Coconut water: కాలంతో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొబ్బరి నీళ్లను తాగాలి.మన ఆరోగ్య సంరక్షణలో కొబ్బరినీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరికాయలు మనకు విరివిగానే లభిస్తాయి.కొబ్బరినీళ్లు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లను ఎండాకాలంలో బాగా తాగుతారు. ఎందుకంటే కొబ్బరి నీరు శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తాయి. అలాగే కొబ్బరి నీళ్లలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి.
నిజానికి ఈ కొబ్బరి నీళ్లను పగలు తాగడం కంటే రాత్రివేళ పడుకునే ముందు తాగితేనే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రక్తపోటును తగ్గిస్తుంది :
కొబ్బరి నీళ్లు తాగడం వలన గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండె సమస్యలకు కారణమయ్యే రక్తపోటును సమర్థవంతగా కొబ్బరినీళ్లు కంట్రోల్ చేస్తాయి..అధిక రక్తపోటు సమస్య ఉన్న వాళ్ళు రాత్రిపూట పడుకునే ముందు కొబ్బరి నీరు తాగితే సహజంగానే రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది.కాని అధిక రక్తపోటు ఉన్నవారు బీపి తగ్గడానికి మందులు తీసుకుంటే మాత్రం కొబ్బరినీళ్లు అధికంగా తాగకూడదు.
శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవ్వకుండా చేస్తుంది:
కొంతమంది శరీరం త్వరగా వేడి. చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎండ, వేడి వాతావరణంలో పనిచేసే వారు కొబ్బరినీళ్లు తాగుతు ఉండాలి. కొబ్బరినీళ్లు తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ అవ్వదు.అధిక వేడి శరీర తత్త్వం ఉన్న వాళ్ళు రాత్రి పడుకునే ముందు కొబ్బరినీళ్లను తాగడం మంచిది.
గుండె ఆరోగ్యానికి రక్షణ.
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటితోపాటు కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగాలి.
కిడ్నీ సమస్యలకు కొబ్బరినీళ్లతో చెక్ :
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీళ్లు ఒక వరం అనే చెప్పాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్ళు, కిడ్నీ వ్యాధిగస్తులు సాయంత్రం పూట కొబ్బరినీళ్లు తాగితే చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు రాత్రంతా శరీరానికి అందుతాయి. ఫలితంగా కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేయడంలో కొబ్బరి నీళ్ల పాత్ర :
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లు తరచుగా కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇవి మూత్రం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలను బయటకు పంపించేస్తాయి.కావున రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.
చర్మం.. జుట్టు సంరక్షణ :
కొబ్బరి నీళ్లలో అధికశాతంలో విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగడం వల్ల జుట్టు బలోపేతం అవుతుంది. అలాగే జుట్టు కూడా రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగితే చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది.