ప్రతి ఒక్కరి వంటగదిలో నల్లమిరియాలు తప్పక ఉంటాయి. ఎందుకంటే నల్ల మిరియాలలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల వలన మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆహారంలో రుచి కోసమే నల్ల మిరియాలు ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే.జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివి వచ్చినప్పుడు ఈ మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇది జీర్ణాశయ వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ తగ్గించడంలో మిరియాల పాత్ర:
నల్ల మిరియాలు టీ ఈ సమస్యలు ఉన్నవారికి అమృతం..!!
నల్లమిరియాలు వాడడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే చెడు కొవ్వు కూడా పెరగనివ్వకుండా చేస్తాయి. స్థూలకాయాన్ని తగ్గించడం నుంచి అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం చూపుతాయి. వీటిని తినడం వలన జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది
దీనివల్ల మీరు గుండెపోటు ప్రమాదం నుంచి రక్షణ పొందుతారు. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారు ఆహారంలో నల్ల మిరియాలు చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.మిరియాలను పొడిగా చేసుకుని టీలో గాని, పాలలో గాని కలుపుకొని తాగవచ్చు
జలుబు, దగ్గు మటుమాయం :
నల్ల మిరియాలు జలుబు,దగ్గు నివారణలో బాగా ఉపయోగకరంగా పనిచేస్తాయి.ఇది జలుబు, దగ్గు, వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.నిజానికి మిరియాలకు ఘాటుదనం అనేది వాటిల్లో ఉండే పెప్పరైన్ అనే రసాయనం వలన వస్తుంది.
కీళ్ల నొప్పులు నివారణలో :
కీళ్ల నొప్పుల సమస్యలని తగ్గించడంలో నల్ల మిరియాలు బాగా ఉపయోగపడతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.
జ్వరాన్ని తగ్గించడానికి:
నల్ల మిరియాలలో యాంటీపైరేటిక్ మరియు అనాల్జేసిక్ చర్యలు ఉంటాయి. కావున జ్వరంతో ఇబ్బంది పడే వాళ్ళకి నల్ల మిరియాలు ఒక మందులాగా పనిచేస్తాయి.నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి అని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. వీటిలో ఘాటుధనం ఎక్కువగా ఉండడం వలన అతిగా తీసుకోకూడదు.