హెల్త్

ఆడవాళ్ళు తినే ఆహారంలో ఈ విటమిన్స్ తప్పకుండా ఉండి తీరాలిసిందే… లేదంటే అంతే సంగతులు..!

Share

ఆడవాళ్ళ యొక్క శరీర తత్త్వం, మగవాళ్ల యొక్క శరీరతత్వం కంటే భిన్నంగా ఉంటుంది. పురుషులతో పోల్చితే ఆడవారు చాలా వీక్ గా ఉంటారు. అందుకే ఆడవాళ్లు తినే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు తాము తినే తిండి విషయంలో శ్రద్ద వహించరు. భర్త, పిల్లలు తిన్నాక ఫుడ్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంట్లో మిగిలిపోయిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల ఆడవాళ్లకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. దీంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవ్వుతారు. నిజానికి ఆడవాళ్లకు ఈ విటమిన్లు చాలా అవసరం అవుతాయి.విటమిన్స్ అన్ని సరిగ్గా అందితేనే ఆడవాళ్లు హెల్తీగా, ఫిట్ గా ఉంటారు. మరి ఆ విటమిన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ ఎ:

ఆడవాళ్లలో వయసు పెరిగేకొద్దీ రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా 40 నుంచి 45 ఏండ్లు రాగానే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు సోకుతుంటాయి.ఇలాంటి సమయంలో విటమిన్ ఎ ను ఎక్కువగా తీసుకోవాలి.ఈ విటమిన్ ఎ గుమ్మడి గింజల్లో, బచ్చలి కూర, క్యారెట్లు, బొప్పాయి లో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ డి :

విటమిన్ డి అనేది ఎముకలు బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ డి సూర్య రశ్మి ద్వారా మనకు లభిస్తుంది అలాగే వివిధ కూరగాయలు, పండ్ల ద్వారా కూడా విటమిన్ డి లభిస్తుంది.డి విటమిన్ లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. విటమిన్ డి అనేది కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ కె :

ఆడవారిలో విటమిన్ కె లోపం ఏర్పడితే పీరియడ్స్, డెలివరీ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అందుకే కె విటమిన్ తగ్గకుండా ఉండేలాగా ఆకు కూరలు, సోయా బీన్స్ ను ఆడవాళ్లు తమ ఆహారంలో చేర్చుకోవాలి.

 


Share

Related posts

Cucumber drink: దోసకాయ డ్రింక్ తో మీ శరీర బరువును తగ్గించుకోవడం ఎలా అంటే..?

Ram

జాజికాయ గురించి తెలుసుకుంటే తప్పకూండా వాడతారు!!

Kumar

గర్భధారణ సమయం లో జరిగే బ్లీడింగ్ గురించి తెలుసుకోవాలిసిన విషయాలు…

Kumar