Instant: ఊతప్పం ఈ పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ.. మన బామ్మలు గారాబంగా ముద్దు చేస్తూ వేడి వేడి ఊతప్పం తినిపించే వారు చిన్నప్పుడు.. ఇప్పుడంతా అట్టు, ఇడ్లీ , పూరి, బోండా ఇవే టిఫిన్స్ అంటే.. ఒక్కసారి బామ్మ స్టైల్ రాగి ఊతప్పం టెస్ట్ చూస్తే అస్సలు వదలరు.. పైగా హెల్తీ కూడా.. ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం తయారీ విధానం..
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు పావు కప్పు, వేరుశనగ పప్పులు పావుకప్పు, రాగి పిండి ఒక కప్పు, పుట్నాల పొడి అర కప్పు, ఓట్స్ అర కప్పు, పుల్లని మజ్జిగ ఒక కప్పు, సోంపు ఒక స్పూన్, మిరియాల పొడి ఒక చెంచా, పచ్చి మిరపకాయలు 4, కరివేపాకు రెండు రెబ్బలు, నెయ్యి _ 4 చెంచాలు.
ముందుగా పెసర పప్పు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి, పుట్నాల పప్పు పొడి, ఓట్స్, పుల్లని మజ్జిగ, పెసరపప్పు, మిరియాలపొడి, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు రెబ్బలు వేసి బాగా కలపాలి. ఇలా పిండి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి వెడెక్కేకా ఒక చెంచా నెయ్యి వేసి ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఊతప్పం లా వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా సన్నని మంట పై దోరగా కాల్చుకోవాలి.. అంతే ఇన్‌స్టెంట్ రాగి ఊతప్పం తినడానికి రెడీ.. ఈ రాగి ఊతప్పం ను కొబ్బరి పల్లీల చట్నీ, అల్లం చట్నీ, కరివేపాకు కారం తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.. రెగ్యులర్గా తినే టిఫిన్స్ కంటే ఊతప్పం ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ఈ రాగి ఊతప్పం ను చేయండి. మధుమేహులకు, అధికరక్తపోటు, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రాగి ఉతప్పం బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…