Oatmeal: హెల్దీ బ్రేక్ ఫాస్ట్స్ లో ఓట్ మీల్ ఆమ్లెట్ కూడా ఒకటి.. ప్రతిరోజు ఒక గుడ్డు తినమని వైద్యులు చెబుతూనే ఉంటారు.. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.. టేస్టీ టేస్టీ గా ఓట్స్ మిల్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ఓట్ మీల్ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు -6, ఓట్స్ 50 గ్రాములు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి -1, ఉల్లిపాయ -1, టమాటో -1, తరిగిన చిన్న అల్లం ముక్క -1, అవాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ -2 స్పూన్స్, ఉప్పు – చిటికెడు, కారం – పావు స్పూన్.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు లోని తెల్లసొన మాత్రమే వేసి బాగా గిలకొట్టాలి. అందులో ఓట్స్ వేడి కలపాలి. ఇందులో సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయ, టమోటా ముక్కలు, కరివేపాకు కొత్తిమిర వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, కారం వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి ఆవాలు వేయాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పెనంపై వేయాలి. అంతే ఓట్ మీల్ ఆమ్లెట్ రెడీ. మనం సిద్ధం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంతో మూడు ఆమ్లెట్స్ అవుతాయి. ఉదయం ఆహారం ఓట్ మీల్ ఆమ్లెట్ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అందుతాయి. దాంతో రోజంతా ఆక్టివ్ గా ఉంటారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ,అధిక రక్తపోటుకు చెక్ పెడతాయి.