29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Shanagala Patoli: శనగలతో ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. తింటే అమోఘం అనాల్సిందే..!

Healthy Breakfast Shanagala Patoli Process
Share

Shanagala Patoli: ఎర్ర శనగలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు, క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ శనగలతో గుగ్గిళ్ళు, కూర వంటి వాటిని కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పాటోలి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక ఎంతో రుచిగా ఉండే శనిగల పాటోలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి..ఇలా అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..?

Healthy Breakfast Shanagala Patoli Process
Healthy Breakfast Shanagala Patoli Process

శనగల పాటోలి తయారీకి కావలసిన పదార్థాలు:
నానబెట్టిన శనగలు-ఒక కప్పు, నూనె2టేబుల్ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు-5, మినప్పప్పు ఒకటి స్పూన్, ఆవాలు , జీలకర్ర ఒక టీ స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ-1, తరిగిన పచ్చిమిర్చి-3, ఉప్పు, తగినంత పసుపు, స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్,

శనగల పాటోలి తయారీ విధానం:
ముందుగా శనగలను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని నీళ్లు లేకుండా వడకట్టుకొని ఒక జారిలోకి తీసుకోవాలి. ఈ శనగలను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి.

ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు మరియు పసుపు వేసి కలపాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న శనగలను వేసి కలిపి తర్వాత మూత పెట్టి పచ్చి వాసన పోయేవరకు మగ్గించాలి. శనగల మిశ్రమం పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసి కలిపి దీనిని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల పాటోలి తయారవుతుంది. ఈ శనగల పాటోలీ ని ఈ విధంగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు..


Share

Related posts

రైతుల కోసం డిజిటల్ స్టూడియో అంట..! ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

Special Bureau

ఏపీ రాజధాని వ్యవహారంలోకి మోడీ ఎంటర్ అయిపోయాడు? ఇక ప్రతిపక్షాలకు పండగే?

arun kanna

Pawan Lokesh: పవన్ – లోకేష్ సీఎంలుగా.. !? “నాగబాబు జబర్ధస్త్ జోకులు”..!

Srinivas Manem