ఈ సృష్టిలో ఎదుటివారికి అందంగా కనిపించాలనే ఆశ ఉండడం ప్రతి ఒక్కరి నైజం. మారుతున్న కాలాన్ని బట్టి, విభిన్న ఆహారపు అలవాట్లతో చాల మంది అందాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలంకంటే పురుషులే అందానికి సంబందించిన కాస్మొటిక్స్ వాడుతున్నట్టు ఒక సర్వేలో తెలింది. అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే నిత్యం తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు తీసుకోవడం ద్వారా అందాన్ని రక్షించుకోవచ్చు.
ఆరోగ్య రీత్యా ప్రతి చాలా మంది వంటలలో పొద్దుతిరుగుడు నూనెను ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో అధిక ప్రోటీన్ కలిగి ఉండడమే కాక ఇనుము, మెగ్నీషియంతో పాటు పలు ఉపయోగకమైన ఖనిజాలు మెండుగా ఉన్నాయి. ఈ గింజలు నిత్యం తీసుకోవడం ద్వారా చర్మా సౌందర్యానికి ఉపయోగపడే పోషక పదార్దాలలో కొలెస్ట్రాల్ కంటెంట్ తొలగించమే కాక చర్మంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించేందుకు కృషి చేస్తాయి. సున్నితమైన చర్మం ఉన్న వారికి చర్మంపై మొటిమలు వచ్చే అవకాశాలు చాల ఉన్నాయి. ఎలాంటి సమస్యలకు పొద్దుతిరుగుడు విత్తనాలు బెస్ట్ మెడిసిన్ అని చెప్పవచ్చు.
అందాన్ని కాపాడుకోవడానికి మరో ముఖ్య పదార్థం చిలకడదుంప. దీనిని తీపి బంగాళాదుంప అని కూడా అంటారు. ఈ చిలకడ దుంపలో బీటా- కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ముఖ్యంగా లభిస్తుంది. ఇది రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఎండకు తిరిగి నల్ల పడ్డ చర్మాన్ని షైన్ చేస్తుంది. అంతే కాకుండా వాతావరణంలోని మార్పుల వల్ల వచ్చే చర్మ సమస్యలను తొలగిస్తుంది. చేపలు మానవ శరీరానికి చాల మేలు చేస్తాయి. చేపలు వారంలో ఒకసారి తీసుకోవడం వల్ల శరీరంలో మాంసకృత్తులు బ్యాలెన్స్ గా ఉంటాయి. కోడిగుడ్లు, పండ్ల రసాలు, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలిపి తాగడం, బచ్చలకూర, పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో పాటు రోజువారీ ఆహారంలో వాల్నట్స్ను ఆహారం తీసుకోవడం వల్ల చర్మంపై ఉన్న చనిపోయిన చర్మ మృత కణాలను తొలగిపోతాయి.