Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Share

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి, వీటితో రకరకాల వంటలు చేస్తూనే ఉంటాం.. ఇక పీనట్ బటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇది లేకుండా ఏ స్నాక్ కంప్లీట్ అవ్వదు.. మరి పీనట్ రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఒకసారి ఇలా చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..! పీనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Healthy Peanut Rice: Recipe Preparation

పీనట్ రైస్ తయారీ విధానం..
కావలసిన పదార్థాలు..
ఒక కప్పు బియ్యం, ఒక కప్పు కొబ్బరి పాలు, అరకప్పు కొబ్బరి తురుము, నువ్వులు రెండు చెంచాలు, సన్నగా తరిగిన అల్లం ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా, నిమ్మకాయ ఒకటి , ఎండుమిర్చి నాలుగు, కరివేపాకు కొద్దిగా, నూనె రెండు చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా..

ముందుగా బియ్యం కడిగి అందులో ఒక కప్పు కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసి అన్నం వండుకోవాలి.. ఇప్పుడు పొయ్యిపై బాండి పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగపప్పులు దోరగా వేయించుకోవాలి.. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటినీ వేసి కొబ్బరి తురుము కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి..

Healthy Peanut Rice: Recipe Preparation

ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకుని అందులో తాలింపు వేసుకోవాలి.. రెండు నిమిషాలు నూనె వేసుకొని పోపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి అల్లం ముక్కలు నువ్వులు కరివేపాకు వేసి వేయించుకోవాలి.. ఇందులోనే ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి కలపాలి.. ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న అన్నం తీసుకువచ్చి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకొని కొత్తిమీర, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవాలి.. అంతే పీనట్ రైస్ తినటానికి రెడీ.. ఈ రైస్ పిల్లలకు అందించడం వలన పిల్లలు చక్కగా ఎదుగుతారు.. వారి బలానికి ఈ రైస్ సహాయపడుతుంది.. జ్ఞాపకశక్తి మెరుగు అవుతుంది..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

24 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

33 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago