Korralu: పూర్వకాలంలో కొర్రలను విరివిగా ఉపయోగించేవారు.. కానీ కాలం మారుతున్న కొద్దీ కొర్రలను తినేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలా మంది కొర్రలతో తయారు చేసిన అన్నం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది . రక్తంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇకపోతే ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఈ కొర్రలతో రుచికరమైన పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు.. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు రాత్రంతా నానబెట్టిన కొర్రలు, నీళ్లు నాలుగు కప్పులు, మూడు టేబుల్ స్పూన్ నెయ్యి, ఉప్పు రుచికి సరిపడా, మిరియాలు ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్ , కరివేపాకు రెండు రెమ్మలు, ఇంగువ రెండు చిటికెలు , అల్లం తరుగు ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి మూడు, జీడిపప్పు గుప్పెడు..
ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో పెసరపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని.. శుభ్రంగా కడగాలి.. ఆ తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసి ఇందులో నానబెట్టిన కొర్రలను , ఉప్పు ,నీళ్లు పోసి మూత పెట్టాలి దీనిని మీడియం మంటపై ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మూత తీసి అంత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి.. నెయ్యి వేడయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత ఉడికించుకున్న పొంగలి లో వేసి కలపాలి.
అంతే.. ఇలా చేయడం వల్ల ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొర్రల పొంగలి తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా సాయంత్రం పూట తినవచ్చు.. దీనిని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.