గుండెపోటు గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే సాధారణంగా ప్రతిఒక్కరి బంధువులలో ఎవరికో ఒకరికి ఈ హఠాత్తుగా వచ్చే గుండె పోటుతో మరణించే ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ గుండె పోటు వచ్చే ముందు లక్షణాలను తెలుసుకుంటే ఆ సైలెంట్ కిల్లర్ బారి నుండి తప్పించుకునే అవకాశం ఉంది. అంతేకాదు తీసుకునే కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారపు అలవాట్ల వల్ల కూడా గుండెను కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం అవి తెలుసుకుందాం.
ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లలో నూనె పదార్థాలు అందరు ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల గుండెకు రక్తాన్ని పంపిణి చేసే రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల గుండె సజావుగా కొట్టుకోవడానికి ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల శరీరానికి కావలిసిన ఆక్సిజన్ అందకుండా పోతాయి. అలా జరుగుతు గుండెలో కావటాలు కొట్టుకోవడం ఆగిపోతాయి. దీన్నే గుండె పోటు అంటారు. ఈ గుండె పోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు రావడం, కొన్ని రకాల లక్షణాలను గుర్తించవచ్చు. గుండె పోటు వచ్చే ముందు ముఖ్యంగా చాతి దగ్గర నొప్పి రావడం లేదా అలసట అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వెంటనే శరీరమంతా చమటలు కూడా పడతాయి. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళండి ఆలస్యమైతే ప్రాణాపాయం తప్పదు.
ఉన్నటుండి మైకం రావడం, దవడ నుండి మీద వరకు బిగుతుగా అనిపించినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నపుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిన అది హార్ట్ ఎటాక్ కు సంకేతం. ముఖ్యంగా మధుమేహం ఉన్న స్త్రీ పురుషులలో గుండెపోటు ముఖ్యంగా వస్తుంటాయి. వారు చాల జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రతగా ఉండాలి. అంతే కాదు ఆహారం తిన్న తరువాత ఛాతి దగ్గర మండుతున్నట్టు అనిపిస్తే తక్షణమే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. గుండెకు సంబందించిన వ్యాధులు ఉన్నవారు దూమపానం మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. అంతేకాదు రోజు వ్యాయామం చేయడం, చిన్న చిన్న దూరాలకు వాహనాలను ఉపయోగించకుండా కాలి నడక మీద ఆధారపడం మంచిది.