ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart Health: ఈ ఆరోగ్య సూత్రం పాటిస్తే మీ గుండె పదిలం..!!

Share

Heart Health: బెంగళూరు మిర్చి గా పిలిచే క్యాప్సికం అందరికీ సుపరిచితమే.. ఇటీవల వంటకాలు, ఫ్రైడ్ రైస్, మంచూరియా, గోభి ఏదైనా సరే క్యాప్సికం ఉండాల్సిందే.. ఇక క్యాప్సికం తో రకరకాల రుచులు నోరూరిస్తాయి.. బెల్ పేప్పర్ ఎరుపు, పసుపు, పచ్చ రంగులో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

capsicum Improves Heart Health:
capsicum Improves Heart Health:

క్యాప్సికం లో విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా జింక్ , కాపర్ , మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఇందులో ఉన్నాయి. ఇన్ని పోషకాలున్న క్యాప్సికమ్ ను మన రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే.. రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. ఎరుపు రంగు క్యాప్సికం లో లైకోపిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గుండెకు హాని కలిగించే హిమో సైటనిన్ ను తగ్గించడానికి, ఇందులోని బి6, ఫోలైట్ సహాయపడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెపోటు రాకుండా నివారిస్తుంది.

capsicum Improves Heart Health:
capsicum Improves Heart Health:

క్యాప్సికం లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. గొంతునొప్పి, జలుబు, దగ్గును తగ్గిస్తుంది. ఇటీవల జరిగిన పరిశోధనల్లో క్యాప్సికమ్ ను ప్రతి రోజు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని తేలింది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు మీ డైట్ లో క్యాప్సికం చేసుకోండి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాప్సికం లో ఉన్నాయి. క్యాప్సికం లో ఉండే కేయాన్ పెయిన్ రిలీఫ్ ఫర్ గా పనిచేస్తుంది. ఇది ఆర్థరైటిస్, రుమటాయిడ్ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచడానికి దోహదపడుతుందని నిపుణుల అధ్యయనాలలో తేలింది.


Share

Related posts

వయాగ్రా ను మించిన పవర్ మీకు కావాలంటే ఇలా చేసి చూడండి… ఇక మీకు తిరుగే ఉండదు !! (పార్ట్ -1)

siddhu

అమరావతి అడ్డాగా ఏపీ బీజేపీ భారీ స్కెచ్..??

sekhar

Eyebrow: ఐబ్రో త్రెడింగ్ చేయించుకునే ముందు ఇలా చేయండి.. పెయిన్ ఉండదు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar