Pregnancy: ఇంట్రా యుటిరైన్ డివైజ్ అంటే అది గర్భాశయంలో అమర్చే ఓ చిన్న టి షేప్ లో ఉండే వస్తువు. దీన్ని సాధారణ భాషలో కాపర్ టి అని కూడా అంటారు. దీన్ని వైద్యులు గర్భాశయంలో అమరుస్తారు. ఇది గర్భాశయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది శుక్రకణాలు అండాన్ని కలిసి ఫలదీకరణం చెందకుండా అడ్డుకుని అవాంఛిత గర్భం నివారిస్తుంది. దీన్ని ఒక్కసారి గర్భాశయంలో ప్రవేశపెడితే ఐదేళ్ల వరకు ఉంచుకోవచ్చు. దీనివల్ల నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారికి రక్తస్రావం కూడా కంట్రోల్ అవుతుంది.
బర్త్ కంట్రోల్ ప్యాచెస్ రోజూ మందులు వేసుకోవడం గుర్తు ఉండదు అనుకున్నవారు ఈ తరహా ప్యాచెస్ ని వాడితే బర్త్ కంట్రోల్ పద్ధతిని చక్కగా కొనసాగించవచ్చు. దీన్ని వారానికోసారి అతికించుకోవాలి . ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇవి మన శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ ను అదుపు చేసి అవాంఛిత గర్భం రాకుండా అడ్డుకుంటుంది. దీన్ని అతికించుకుని తియ్యడం చాలా తేలికా.కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్స్ ఈ బర్త్ కంట్రోల్ పద్ధతి కాంట్రాసెప్టివ్ పిల్స్ లా ఉపయోగపడుతుంది. అయితే మందుల రూపంలో కాకుండా ఇంజెక్షన్ రూపంలో వీటిని ఇస్తారు. ఒక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అది 150 రోజుల వరకు పని చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. చాలా రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది. కేవలం ఆ ఇంజెక్షన్ తీసుకున్న తేదీ క్యాలెండర్ లో నోట్ చేసుకొని ఆ సమయం పూర్తవగానే మళ్లీ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది.
ఇవి అవాంఛిత గర్భం రాకుండా జాగ్రత్తపడే పద్ధతులు.. అయితే కొత్త పద్ధతి ఏది మొదలు పెట్టాలనుకున్న అది మీకు నప్పుతుందా? దాని వల్ల ఎలాంటి ఎలాంటి ఫలితాలు రావచ్చు వంటి విషయాలన్నింటినీ డాక్టర్ ని అడిగి తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది సరైన పద్దతి