Romance: శృంగార సామర్థ్యం పది కాలాలు పదిలం గా ఉండటానికి నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే !!

Share

Romance: శృంగార సామర్ధ్యాన్ని పది కాలాల పాటు పదిలంగా  కాపాడుకోవాలి అనుకుంటే  మన నిత్య జీవితంలో తినే ఆహార అలవాట్లు  మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే  కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వలన  శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
మరి కొన్ని పదార్థాలు తీసుకుంటే శృంగార సామార్థ్యం తగ్గిపోతుంది అని అనేక పరిశోధనలు చేసిన పరిశోధకులు తెలియచేస్తున్నారు.    ముఖ్యంగా తియ్యని పదార్థాలు  తినేవారు, చెడు అలవాట్లు మద్యం,  పొగ తాగే  అలవాటు ఉన్నవారికి  శృంగార వాంఛ  తగ్గిపోతుంది అని  తెలియ చేస్తున్నారు.  స్వీట్స్ లో      ఆస్పార్టెమ్ అనే పదార్థం ఉంటుంది, ఇది శరీరంలో హార్మోన్ల  బాలన్స్ గా ఉండనివ్వకుండా ఆటంకం  కలిగిస్తుంది అని దాని  ఫలితంగా మూడ్ మారిపోయి లైంగిక  కోరికలు   సన్నగిల్లేలా చేస్తుంది అని  నిపుణులు వివరిస్తున్నారు.

స్వీట్స్ తినడం కన్నా  తేనె, బెల్లం లాంటివి తినడం మంచిది అని తెలియ చేస్తున్నారు.   అలాగే  వెన్న ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లైంగిక వాంఛలు  తగ్గిపోతున్నాయి.  శరీరంలో ఉండే ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, టాక్సిన్లను   వెన్న మరింత  ప్రభావితం చేస్తుంది. అందువల్ల  వీలైనంతవరకు  దీనికి దూరంగా ఉండటం మంచిది అని తెలియ చేస్తున్నారు. రక రకాల చిప్స్‌ని బాగా ఇష్టపడి తినే అలవాటు ఉన్నవారు కూడా  జాగ్రత్తగా ఉండటం మంచిది. వీటిని  ఎక్కువగా తింటే శరీరంలో  కొవ్వు   విపరీతం గా   చేరిపోతుంది.ఈ కారణంగా  శృంగార కోరికలు తగ్గిపోతాయి. ఇక కాఫీ, టీ వంటి వాటి విషయానికి వస్తే రోజుకు రెండు, మూడు కప్పుల కాఫీ అయితే ఫర్వాలేదు, కానీ  అంతకు మించితే శరీరంలో హార్మోన్ల పై  ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కూల్‌డ్రింక్స్ కూడా  శృంగార కోరికల్ని  తగ్గించేస్తాయి అనే కొత్త విషయాన్ని నిపుణులు బయటపెట్టారు.

ఇక  అధిక బరువు తగ్గించుకోవడానికి  ఈత  బాగా పనిచేస్తుంది.దానితో పాటు  రోజూ అరగంట సేపు సైకిల్ తొక్కితే ఐదువందల కేలరీలు తగ్గుతాయి.వాకింగ్  స్లీపింగ్ వంటి  వ్యాయామం వల్ల కాళ్లు, చేతులు నాజుకుగా తయారవుతాయని తెలియచేస్తున్నారు.ఆహార నియమాలు పాటిస్తూ   చిన్న,చిన్న ఎక్సర్‌సైజులతో శరీర బరువును అదుపులో  ఉంచుకోవటం తో పాటు మంచి శృంగార జీవితాన్ని అనుభవించవచ్చు.


Share

Related posts

ఆ టైం లో యూపీఐ పెమెంట్స్ చెయ్యద్దు ..!!

bharani jella

” అబ్బే కుదరదు .. తేడా వస్తే వాళ్ళకంటే నేను ఎక్కువ బాధపడతా ” జగన్ ఓపెన్ గా చెప్పేశాడు !

sekhar

రాఫెల్ డీల్ తో మేలేం జరిగింది?!

Siva Prasad