Beauty Tips: అందంగా ఉండాలని, అందమైన చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడి డబ్బులు వృధా చేసుకోవడమే గాని మీరు ఆశించని ఫలితం మాత్రం పొందలేరు. నిజానికి మీ చర్మ సౌందర్యాన్ని మరింత అందంగా మార్చే చిట్కాలు మీ వంటగదిలోనే ఉన్నాయి. బియ్యపు పిండి గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. బియ్యపు పిండితో వంటకాలే కాకుండా ఫేస్ ప్యాక్ లను కూడా వేసుకోవచ్చు తెలుసా. ఇది వివిధ రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంతో పాటు మీ చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే మీ ముఖం మీద ఉన్న టాన్‌ను తొలగించడంలో కూడా బియ్యం పిండి మంచిగా ఉపయోగపడుతుంది.
Hair &: Beauty: జుట్టుకు, అందానికి ఈ పండు చాలు..!!
బియ్యపు పిండిలో పారా-అమినోబెంజోయిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది బియ్యం పిండికి సన్‌స్క్రీన్ లక్షణాలను ఇస్తుంది. వృద్ధాప్య సంకేతాలు రాకుండా మీ చర్మాన్ని కాపాడుతుంది. మీరు మీ చర్మాన్ని బియ్యం పిండిని ఉపయోగించి ఎలా పేస్ ప్యాక్స్ వేసుకోవాలో చుడండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి, 3 టీ స్పూన్ల తేనే, కొద్దిగా రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖం మీద పూసుకుని ఒక 15-20 నిమిషాలు పాటు అలానే ఉంచాలి.. ఆ తరువాత దానిని గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఒక వారం రోజుల పాటు ఇలా పేస్ ప్యాక్ వేసుకుంటే ఆశించిన ఫలితం పొందుతారు.
Beauty Tips : మిలమిలా మెరిసిపోయే మోము కోసం ప్రత్యేక టిప్స్..
అలాగే మరొక ఉపయోగకరమైన పేస్ ప్యాక్ ఏంటంటే కొద్దిగా బియ్యం పిండి, ఓట్స్, తేనె, పాలు అన్ని కలిపి ఫేస్ కి అప్లై చేసి ఒక పావుగంట తరువాత కడిగేయాలి. మంచి స్కిన్ టోన్ కలిగి ఉండాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి మంచి ఫలితం వస్తుంది. బియ్యం పిండితో మరో అద్భుతమైన పేస్ ప్యాక్ ఏంటంటే ఆపిల్, ఆరెంజ్ అలాగే తేనె ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో సగం తురిమిన ఆపిల్ 2-3 ముక్కలు, రెండు చెంచాల నారింజ రసం జోడించండి. అలాగే ఒక టీస్పూన్ తేనె, టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని జోడించండి. అన్ని పదార్థాలను కలిపి ఒక మందపాటి పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ ప్రాంతమంతా అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండు మూడు సార్లు ఈ పేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.