Nails Biting: కొంతమంది తరుచుగా గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి అలా గోళ్లు కొరుక్కోవడం అనేది ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు వారికి తెలియకుండానే తమ చేతివేళ్లు నోటి దగ్గరకు వెళ్ళిపోతాయి. చిన్నప్పటి నుంచి గోళ్లు కొరికే అలవాటు ఉంటే మాత్రం పెద్దయ్యాక కూడా అదే అలవాటుగా మారిపోతుంది. కొందరు బాగా ఒత్తిడి, ఆందోళనకు గురయినప్పుడు గోళ్లు కొరుకుతూ ఉంటారు. మరికొందరు టీవీ చూస్తున్నప్పుడు కూడా గోళ్లు కొరికేస్తూ ఉంటారు. ఈ అలవాటును మానిపించకపోతే పెద్దాయ్యాక కుడా కొనసాగుతుంది.
Nails: మీ చేతికి గోళ్ళు ఉన్నాయా.. అయితే తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి మీరు..
నిజానికి ఇలా గోళ్లు కొరకడం అనేది చాలా చెడ్డ అలవాటు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. గోళ్ళను తరుచుగా కొరకడం వలన చుగుళ్ళలో నొప్పి వస్తుంది. అంతేకాకుండా గోళ్లు పెరిగే కణజాలం కూడా దెబ్బతింటుంది. గోళ్లు కొరికే అలవాటు వల్ల చేతులకు ఉన్న మురికి అంతా పొట్ట లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అలవాటును ఎలా పొగొట్టాలని ఆలోచిస్తున్నారా.. ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే సరి. మరి ఆ అలవాట్లు ఏంటో ఒకసారి చూద్దామా..
Nails: గోర్లు కట్ చేసుకునే ముందు ఈ విషయం తెలుసుకోండి!!
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉన్నట్లయితే ముందుగా మీ గోళ్లను చిన్నగా కట్ చేయండి. అలా గోళ్లును పొట్టిగా కట్ చేస్తే అవి నోటికి అందకుండా ఉంటాయి. ఇలా చేస్తే గోళ్లు కొరకడంపై ధ్యాస అనేది తగ్గిస్తారు. ఇంకా ఆడవాళ్ళకి కనుక ఈ అలవాటు ఉన్నట్లయితే గోళ్లపై నెయిల్ పాలిష్ ను వేసుకోవాలి. అలా నైల్ పాలిష్ వేసుకుంటే మీరు గోళ్లని కొరికినప్పుడు గోళ్ళరంగు వాసన మిమ్మల్ని గోళ్ళ మీద దృష్టి పెట్టనివ్వదు. ఇంకా గోళ్లు కొరకకుండా ఉండాలంటే కొన్ని రోజులు చేతి రుమాలుని ఒక కర్చీఫ్ లాంటింది చుట్టండి. లేదంటే కొన్ని రోజుల పాటు గ్లోవ్స్ ధరించండి. గోళ్ళను కొరకడం అనేది చాలా చెడ్డ అలవాటు అని పదే పదే మనసులో అనుకుంటూ ఉండండి. అలా అందరి ముందు గోళ్లు కొరకడం అనేది చాలా అసహ్యంగా ఉంటుందనే విషయాలను గుర్తు పెట్టుకుని మీ ద్యాసను వేరే పని మీద మళ్లించండి. పైన చెప్పిన చిట్కాలను కొన్ని రోజులు పాటించి చుడండి. కొద్దిరోజుల్లోనే గోళ్లు కొరకడం మీరే మానేస్తారు.