Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-1)

Share

Married Life: ఈ రోజుల్లో చాలా మంది  పెళ్లి కాని వారు..పెళ్లి  అనే మాటెత్తితే చాలు  భయపడిపోతున్నారు. తమను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి  వస్తారో లేదో అని  తెగ బాధ పడుతుంటారు. నిజానికి.. వివాహం జీవితం అనేది ఆలుమగల  ప్రేమానురాగాలు, ఒకరి కష్టాన్ని మరొకరు అర్ధం చేసుకుని ఒకరికొకరు సపోర్ట్ గా నిలవడం పై ఆధారపడి ఉంటుంది. అసలు వివాహమైన భార్యాభర్తల వైవాహిక జీవితం సమస్యలు లేకుండా   సాఫీగా సాగాలంటే ఏం చేయాలి   అన్నది తెలుసుకుందాం.

Read more : Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-2)

కొత్తగా పెళ్లి అయిన వారు రెండు వేరు వేరు కుటుంబాల నుండి పద్దతుల  నుండి వస్తారు.  కాబట్టి కొన్ని అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. అంతవరకూ ఎందుకు మన తో నే మన ఇంట్లో పెరిగిన మన తోడబుట్టిన వారితో మనం గొడవ పడకుండా ఉన్నామా? లేదు కదా మరి కొత్త వ్యక్తి గురించి తెలుసుకుని బ్రతకడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి  ఇద్దరు ఓర్పు వహించవలసి ఉంటుంది.  కాబట్టి బేధాలు రాకుండా ఉండటానికి కొన్ని సూత్రాలు, విలువలు,  ప్రవర్తన లో    కొన్ని మార్పులు చేసుకుంటే   మీ దాంపత్య జీవితం విజయవంతం అవుతుంది అని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు. భాగస్వామిని  ఎప్పుడూ అదే పనిగా విమర్శించకూడదు అని తెలియచేస్తున్నారు.  భార్య లేదా భర్త  ప్రవర్తన విధానాన్ని  ధోరణులకు మాత్రమే సున్నితంగా విమర్శలు చేయండి.మీరు చాలా మంచి వ్యక్తివి కాక పొతే ఈ అలవాటు లేదా ఇలాంటి ప్రవర్తన వలన ఇబ్బందులు వస్తాయి ఆలోచించి చూడు అని ఒకరికి ఒకరు వివరించుకోండి.

Read more : Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-2)

ఏ విషయంలోనైనా సూటిగా, నిజాయితీగా ఉండటం  మంచిది.  ఎదుటివారి గురించి మీరు ఏమనుకుంటారో    అదే సున్నితంగా, స్పష్టంగా చెప్పాలి . ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు, అనేది సరైన పదాలలో తరచూ  మాట్లాడుకుంటూ ఉండాలి.ఒకవేళ  ఇంట్లో వీలు కాకపోతే వారానికొక రోజు ఎక్కడికైనా వెళ్ళి అయినా మాట్లాడుకోవడం మంచిది. మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా విని సరిదిద్దుకోవాలి సినవి ఉంటే మార్చుకోండి. మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుని  కావలసిన మార్పు చేర్పులు  చేసుకోవడం ముఖ్యం. ఒకరి పేరెంట్స్ ని మరొకరు గౌరవం గా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు గొడవ పడేటప్పుడు వారిని నిందించకండి.. మీ గొడవ మీ ఇద్దరి కి సంబందించినది అయి ఉండేలా తప్ప అందులో ఇంకా ఎవరిని తీసుకు రాకుండా ఉండటం మంచిది.


Share

Related posts

Kidney: కిడ్నీ సమస్య ఉన్నపుడు ఆహారం లో వీటిని తీసుకోండి!!

Kumar

Priyamani : ఇది నాకు ఛాలెంజింగ్ పాత్ర … ప్రియమణి

GRK

కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న పేషంట్లు

Siva Prasad