Black Heads: ఈరోజుల్లో యువతను ప్రధానంగా వేధిస్తున్న చర్మ సమస్యలలో బ్లాక్ హెడ్స్ కూడా ఒకటి..! చర్మంపై ఉండే రంధ్రాలలో నూనె దుమ్ము మృతకణాలు పేరుకుపోయి బ్లాక్ హెడ్స్ గా ఏర్పడతాయి.. ఇవి చాలా మొండిగా ఉంటాయి.. ఓపట్టాన పోవు.. తీసే కొద్దీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.. ముక్కు పై వచ్చే ఈ నల్లటి మచ్చలను తొలగించిన కూడా పదే పదే విసిగిస్తూ ఉంటాయి.. ఈ బ్లాక్ హెడ్స్ కు సింపుల్ గా చెక్ పెట్టండిలా..!
కోడిగుడ్డులోని తెల్లని సొన తో బ్లాక్ హెడ్స్ ను ఈజీ గా తొలగించవచ్చు . ఇందుకోసం గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి.
కోడిగుడ్డు తెల్లసొనలో కాటన్ బాల్ వేయాలి. ఆ సొన అంత కాటన్ పీల్చుకున్న తర్వాత ముఖం పై ఆ కాటన్ బాల్ ఉంచి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు కలిపి ఆ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. బ్లాక్ హెడ్స్ ను తొలగించడం లో బేకింగ్ సోడా కీలక పాత్ర పోషిస్తుంది. కోడిగుడ్డు తెల్లసొన తేనె కలిపి రాసుకున్న బ్లాక్ హెడ్స్ పోతాయి. కోడిగుడ్డు తెల్లసొనలో పంచదార కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?