Heat Boils: వేసవి కాలం వచ్చిందంటే సెగ గడ్డలు వస్తుంటాయి.. శరీరంలో అధిక వేడి కారణంగా శరీరంలో పలు చోట్ల సెగ గడ్డలు వస్తాయి. సెగ గడ్డలు వచ్చిన చోట తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది.. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇవి వస్తుంటాయి.. సెగ గడ్డలు వచ్చినప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సెగ గడ్డలు రాకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను, పండ్లను మీ డైట్లో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు నాలుగు లీటర్ల మంచి నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన శరీరంలో ఉండే టాక్సిన్లు, విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రకరకాల పండ్లు, కూరగాయలు జ్యూస్లు, కొబ్బరి బొండం నీళ్ళు తరచు తాగుతూ ఉండాలి. రెండు చెంచాల బియ్యం పిండిని ఒక గిన్నెలో వేసుకుని అందులో కొద్దిగా నీళ్ళు పోసి దానిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని సెగ గడ్డలు వచ్చిన చోట రాయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే వేడి బొబ్బలు త్వరగా మానిపోతాయి.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వెల్లుల్లి పాయలను నాలుగు రెబ్బలు తీసుకొని అందులో అర చెంచా వాము కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ పేస్ట్ ను వేడి బొబ్బలు దగ్గర ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. బంగాళదుంప రసాన్ని కూడా సెగ గడ్డలు ఉన్నచోట రాస్తే మంచి ఫలితం కనబడుతుంది. నానబెట్టిన మెంతులు ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని వేడి బొబ్బలు ఉన్న చోట రాస్తే సెగ గడ్డలు త్వరగా పగిలిపోతాయి.