Tooth Pain: దంత సమస్యల లో పంటి నొప్పి కూడా ఒకటి.. మనం తినే ఆహారం దంతాలలో పేరుకుపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పంటి నొప్పికి దారితీస్తుంది.. పంటి నొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు.. ఏ పని చేయలేము.. ఆ బాధ వర్ణనాతీతం.. పంటి నొప్పికి చెక్ పెట్టండానికి ఈ చెట్టు ఆకులు అద్భుతంగా పని చేస్తాయి..!!
ఒకప్పుడు అందరి ఇళ్ళల్లో జామ చెట్టు కనిపించేవి. నేడు జామకాయల తో పాటు జామ ఆకులను కూడా కొనుక్కునే పరిస్థితికి వచ్చాము. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. దంత సమస్యలకు జామ ఆకులు మేలైనా ఫలితాలను అందిస్తాయి. జామ ఆకుల లో విటమిన్ బి, సి , పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, లైకోపిన్, క్వెర్స్ టిన్ ఉన్నాయి. వీటితోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలను కూడా కలిగి ఉంది. అందువలన జామ ఆకులు పంటి నొప్పికి చెక్ పెడతాయి.
దంతాల నొప్పి తగ్గాలంటే ముందుగా జామ ఆకులను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గ్లాస్ నీటిలో నాలుగు జామ ఆకులను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇలా మరిగించిన జామ ఆకుల కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా రోజుకి నాలుగు సార్లు చేస్తూ ఉంటే దంతాల లో ఉన్న బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ కారక క్రిములను నశింపజేస్తుంది. దంతాల నొప్పిని తగ్గిస్తుంది. జామ చెట్టు ఆకులతో కషాయం తాగడం లేనివారు.. పచ్చి జామకాయ ఆకులని నమిలినా కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.