హెల్త్

కడుపు నొప్పిని క్షణాల్లో తగ్గించే బెస్ట్ టిప్స్..!

Share

మారుతున్న జీవనశైలి, ఆహారపు. అలవాట్ల కారణంగా పొట్టలో సమస్యలు ఏర్పడడం సాధారణమైపోయింది.కడుపులో తిమ్మిర్లు, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.కడుపునొప్పి వస్తే భరించడం చాలా కష్టం.ఒక్కసారి నొప్పి మొదలైతే అది ఎంతగా బాధ పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.కడుపు నొప్పి తగ్గాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరి. మరి ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం:


అల్లంలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు ఉంటాయి.దగ్గు,జలుబు, కడుపు నొప్పి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టీ చేసుకుని తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మెంతులు:

మెంతుల్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. శరీరాన్ని ఇతర వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి కడుపు నొప్పితో బాధపడుతున్న వారు వీటిని ఒక గిన్నెలో నానబెట్టుకున్న వాటి నుంచి తీసిన నీరుని తాగితే కడుపు నొప్పి ఇట్టే మాయం అవుతుంది. అంతేకాకుండా వీటితో చేసిన పొడిని కూడా నీటిలో కలుపుకుని తాగొచ్చు.

పెరుగు:

మనం తరచుగా ఆహారాల్లో పెరుగును వాడుతూనే ఉంటాము.. పెరుగులో ఉండే మూలకాలు కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.కడుపు నొప్పితో ఇబ్బంది. పడుతున్న వారు పెరుగు తింటే పొట్టలో సమస్యలు తగ్గుతాయి


Share

Related posts

Pregnancy: అవాంఛిత గర్భం రాకుండా కొన్ని సురక్షితమైన పద్ధతులు ఇవే !!(పార్ట్ -2)

siddhu

Kids: మీ పిల్లలకు దంతాల సమస్యలు రాకూడదంటే ఇవి ఇవ్వకండి..!

bharani jella

Mamidi Puvvu: మామిడి పూత ఈవిధంగా తీసుకుంటే డాక్టర్ తో అవసరమే ఉండదు..!

bharani jella