హెల్త్

గ్యాస్, అజీర్తి సమస్యలకు వార్మ్ వాటర్ తో చెక్ పెట్టండి ఇలా..?

Share

ఈ మ‌ధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అజీర్తి, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఏమి తిన్నాగాని కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది.మారుతున్న కాలంతో పాటుగా ప్రజల ఆహారపు అలవాట్ల విషయంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ పుడ్స్ లాంటి ఆహారపదార్ధాలను తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ స‌మ‌స్య‌ల నుండి త్వ‌ర‌గా ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్ పాటించండి.

మన అందరి ఇంటిలోనూ వాము తప్పనిసారిగా ఉంటుంది. జీర్ణ సంబందిత సమస్యలకు వాము చక్క‌ని ప‌రిష్కారం అనే చెప్పాలి.వామును వాడడం వలన అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ మొద‌లైన స‌మ‌స్య‌లు తగ్గుతాయి.వామును తినడం వలన జీర్ణ‌క్రియ‌లో ఇబ్బందులు తొల‌గిపోయి జీర్ణ ప్ర‌క్రియ‌ వేగవంతం అవుతుంది.అలాగే అజీర్తి వ‌ల‌న క‌లిగే క‌డుపు నొప్పిని త‌గ్గిస్తుంది.వామును నిమ్మ‌ర‌సంతో క‌లిపి తీసుకున్న‌ప్పుడు జీర్ణాశ‌యంలో హైడ్రో క్లోరిక్ యాసిడ్ పునరుద్ధ‌రించ‌బ‌డి ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. ఈ రెండింటినీ క‌లిపి తీసుకున్న‌ప్పుడు క‌డుపు ఉబ్బ‌రం అనేది త‌గ్గుతుంద


దీనికోసం కొద్దిగా వాము తీసుకొని దానికి నిమ్మ‌ర‌సంతో పాటు చిటికెడు న‌ల్ల ఉప్పును క‌లిపి రోజుకు 2 సార్లు సేవించాలి. దీని వ‌ల‌న మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.అలాగే వాము ఇంకా అల్లం పొడి మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవ‌చ్చు.ఇందుకోసం ముందుగా వాము ఇంకా ఎండ‌బెట్టిన అల్లంను క‌లిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 1 టీ స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా నీళ్లు ఇంకా చిటికెడు న‌ల్ల ఉప్పును క‌లిపి తాగితే మంచిది.అలాగే కొన్ని నీళ్ల‌లో వాము గింజ‌ల‌తోపాటు కొద్దిగా ఉప్పు వేసి మ‌రిగించాలి. ఇలా కాసేపు మ‌రిగించిన త‌రువాత చల్లార్చి వ‌డ‌బోసుకోవాలి. ఈ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

అలాగే కొద్దిగా వాము ఇంకా చిటికెడు ఇంగువ‌ను క‌లిపి న‌మిలి మింగుతూ ఉండాలి. అవ‌స‌రం అయితే కొద్దిగా నీళ్ల‌ను కూడా తాగ‌వ‌చ్చు. దీని వ‌ల‌న జీర్ణ‌శ‌యానికి సంబంధించిన వివిధ ర‌కాల ఇబ్బందులు తొల‌గిపోతాయి. ఈ విధంగా వామును త‌ర‌చూ మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల‌న క‌డుపు నొప్పి, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ లాంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌వు.

 

 


Share

Related posts

Parsley Tea: బరువు తగ్గాలనుకుంటున్నారా..!? అయితే ఈ టీ తాగండి..!!

bharani jella

Brush: బ్రష్ చేసిన తర్వాత ఈ పొరపాటు చేస్తున్నారా..!? అయితే ఏం జరుగుతుందో చూడండి..!!

bharani jella

కాన్సర్‌ను జాగిలాలు పసిగట్టగలవా!?

Siva Prasad