పన్నీర్ అంటే అందరికీ ఇష్టమే..! కానీ పన్నీర్ ఎక్కువగా బయట నుంచి కొనడానికి అందరూ ఇష్టపడతారు కానీ పన్నీర్లో మన ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలతోనే కాదు పెరుగుతో కూడా పన్నీర్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు.. పెరుగుతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
పెరుగుతో పన్నీర్ తయారు చేసుకోవడానికి ఒకటిన్నర కప్పు పాలు, ఒకటిన్నర కప్పు పెరుగు అవసరం.. ముందుగా పాలు ఒక గిన్నెలో పోసుకొని బాగా మరగ కాసుకోవాలి.. మరోవైపు పెరుగు తీసుకొని గిలక్కొట్టి స్మూత్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.. పొయ్యి మీద ఉన్న పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు పాలల్లో వేసి కాయాలి. కాసేపటి తరువాత పాలు విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో విరిగిపోయిన పాల మిశ్రమం పోయాలి.. నీళ్లు అన్ని కారిపోయిన తరువాత చుట్టి దానిపైన బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టాలి.. కాసేపటి తరువాత విరిగిపోయిన పాల మిశ్రమం అంతా గట్టిగా అవుతుంది.. ఈ మిశ్రమం తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.. అంతే పెరుగుతో టేస్టీ టేస్టీ పన్నీర్ రెడీ. ఎప్పటిలాగే పన్నీర్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు..