Hair Conditioner: పొడవైన ఒత్తైన జుట్టు ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది.. అటువంటి జుట్టు కోసం హెయిర్ కండీషనర్ వాడటం తప్పనిసరి.. మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ కండీషనర్ వాడిన ఉపయోగం లేదా..!? అయితే మీ ఇంట్లోనే సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ తయారు చేసుకోండి..! మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..!

కండిషనర్ తయారీ కోసం బాగా పండిన అరటి పండు, ఒక చెంచా తేనె, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అవసరం. ముందుగా బాగా పండిన అరటి పండును తీసుకొని మిక్సీ పట్టి గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అరటి పండు గుజ్జులో తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ కండీషనర్ ను జుట్టు కుదుళ్ల నుంచి తలకు పట్టించాలి.

హెయిర్ కండిషనర్ రాసుకున్న అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా రెండు సార్లు హెయిర్ కండీషనర్ అప్లై చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు తగ్గటంతోపాటు జుట్టుకు పోషణ అందిస్తాయి. జుట్టు ఊడకుండా చేసి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. డ్యామేజ్ అయిన జుట్టు కుదుళ్లను రిపేర్ చేసి జుట్టు నల్లగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.