చేపలు తినడం వ‌ల్ల ఏమ‌వుతుందో తెలుసా?

భోజ‌న‌ప్రియుల‌తో పాటు చాలా మంది చేప‌లంటే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాటి రుచి చాల ప్ర‌త్యేకం కాబ‌ట్టి. మ‌రకొంద‌రైతే… చికెన్, మ‌ట‌న్ ల కంటే చేప‌లు తిన‌డానికి మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తిరోజు చేప‌లు తినే వారు ఉన్నారంటే ఆశ్చ‌ర్య పోన‌క్కర్లేదు. ఇది ఒక్క‌ప‌క్క విష‌యం, మ‌రో వైపు గ‌మ‌నిస్తే.. చేప‌ల వాస‌న త‌గిలితే చాలు అంత దూరం పారిపోయే వారు సైతం లేక‌పోలేరు. చేప‌లు తినే వారిని కూడా ఇష్టప‌డ‌రు అంటే ఇక మీరే అర్థం చేసుకోవాల‌ని అలాంటి వారిని గురించి.. !

అయితే, ఇలా చేప‌లు అధికంగా తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతోందో తెలుసా? అస్స‌లు పూర్తిగి తిన‌క‌పోవ‌డం వ‌ల్ల ఏమవుతుందో మీకు తెలుసా? మొత్తంగా చేప‌లు ఆరోగ్యానికి మంచివేనా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం..! చేప‌లు తిన‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే శరీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు సంవృద్ధిగా ఉండ‌టంతో పాటు విట‌మిన్లు సైతం చేప‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి.

అందువ‌ల్ల చెప‌లు తిన‌డంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ద‌రిచేర‌కుండా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయ‌ని తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. చెప‌లు తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌తో పాటు మ‌రిన్ని వ్యాధులు ద‌రిచేర‌కుండా ఉంటాయ‌ని అమెరికాకు చెందిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్య‌య‌నం పేర్కొంది. మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రిసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్ సైతం విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ క‌థ‌నాలు ప్ర‌చురించాయి.

దీనికి ప్ర‌ధాన కార‌ణం చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలే కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. చేప‌ల్లో పుష్క‌లంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల కార‌ణంగా శ‌రీరంలో ఉండే చెడు కొవ్వు బ‌య‌ట‌కు చేరుతుంద‌నీ, దీని కార‌ణంగా శ‌రీరంలోని ర‌క్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంద‌ని వివ‌రించారు. దీనికి కోసం మాక‌రెల్‌, సాల్మ‌న్‌, హెర్రింగ్‌, లేక్‌ట్రౌట్‌, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా వంటి ర‌కాల చేప‌లు తిన‌డం మంచిద‌ని పేర్కొంటున్నారు. వారంలో రెండు నుంచి మూడు సార్లు చేప‌లు తిన‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నీ, అయితే నిత్యం మ‌రీ ఎక్కువ‌గా తీసుకోవ‌డం అంత మంచిది కాద‌ని వివ‌రించారు.