కరోనా ఏమోగానీ ప్రస్తుతం జనాలకు భయం అంటూ లేకుండా పోయింది. ఒకప్పుడు కరోనా అంటే తీవ్రంగా భయపడ్డారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కానీ జనాలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. అందువల్ల కరోనాకు ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. అయితే గుండె జబ్బుల వంటి వ్యాధులు ఉన్నవారు కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వారు కోవిడ్ బారిన పడితే హార్ట్ రేట్‌ను గమనించడం అత్యంత ఆవశ్యకం అయింది.
అయితే కోవిడ్ ఉన్నవారు మాత్రమే కాదు, ఇతరులెవరైనా సరే.. తమ హార్ట్ రేట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. హార్ట్ రేట్ అంటే చాలా మంది బ్లడ్ ప్రెషర్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ హార్ట్ రేట్ వేరు. బీపీ వేరు. హార్ట్ రేట్ అంటే గుండె నిమిషానికి కొట్టుకునే బీట్స్ సంఖ్య అన్నమాట. ఆరోగ్యవంతులుగా ఉన్న వ్యక్తుల్లో హార్ట్ రేట్ నిమిషానికి 61 నుంచి 100 వరకు ఉంటుంది. కరోనా నేపథ్యంలో హార్ట్ రేట్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల్సి వస్తోంది. హార్ట్ రేట్ తగ్గితే వెంటనే జాగ్రత్త పడాలి.
కరోనా లేని వారు కూడా హార్ట్ రేట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకు మార్కెట్లో పలు ఫిట్నెస్ పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి కచ్చితత్వంతో పనిచేయవు. కనుక హార్ట్ రేట్‌ను తెలుసుకోవాలంటే.. మణికట్టుపై వేలిని ఉంచి పల్స్ రేట్ చూడాలి. 60 సెకన్లలో పల్స్ ఎంత సేపు కొట్టుకుంటే అంత హార్ట్ బీట్ ఉన్నట్లు లెక్క. దీంతో హార్ట్ రేట్‌ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే హార్ట్ రేట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. అది తగ్గినా పెరిగినా వెంటనే స్పందించి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారికి హార్ట్ రేట్ పెరగడమో, తగ్గడమో అవుతుంది. కనుక అలాంటి వారు ఏమాత్రం అజాగ్రత్త వహించరాదని నిపుణులు చెబుతున్నారు.
ఇక సాధారణ సమయంలో ఉండే హార్ట్ రేట్ కంటే రెస్టింట్ హార్ట్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మనం నిద్రించే సమయంలో ఉండే హార్ట్ రేట్ అన్నమాట. ఆ సమయంలో గుండె సహజంగానే తక్కువగా కొట్టుకుంటుంది. ఇక క్రీడాకారులు, అథ్లెట్లకు కూడా హార్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. కనుక వీరు కాకుండా ఇతరులకు హార్ట్ రేట్ మరీ తక్కువగా ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్నా అనుమానించాలి. వెంటనే పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. హార్ట్ రేట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతుంటే గుండె సమస్యలు ఉన్నాయేమోనని అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. సమస్యలు ఉంటే వెంటనే స్పందించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. కాగా ప్రపంచంలో ఇతర దేశాలకు చెందిన వారి సరాసరి హార్ట్ రేట్ 72 బీపీఎం ఉండగా.. భారతీయుల సరాసరి హార్ట్ రేట్ 80 బీపీఎంగా ఉంది. అయితే ఇందుకు కారణాలు ఏమిటో సైంటిస్టులు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. కానీ మన దగ్గర ఉండే ఉష్ణోగ్రతలు, వాతావరణం, మనం తినే ఆహారాలు, ఇతర జీవనశైలి అలవాట్ల వల్ల మన హార్ట్ రేట్ ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.