సహజం గా మనం గుడ్లను ఫ్రిజ్లో నిల్వఉంచుతుంటాము. అలా చేయడం వల్ల ప్రమాదమే కాదు, అనారోగ్యాలను కొని తెచ్చుకోవడమే నని పరిశోధకులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వలన అందులో బాక్టీరియా పెరిగి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్లోని ఉష్ణోగ్రత సున్నా కంటే చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆహారం పాడవకుండా అందులో ఉంచవచ్చు. అయితే గుడ్లను ఫ్రిజ్లో ఉంచినప్పుడు, వాటిలో ఒక రకమైన హానికర బ్యాక్టీరియా పుడుతుంది. గుడ్లను ఉడికించాలనుకున్నప్పుడు ఫ్రిజ్ నుండి తీసి వాటిని అలాగే ఉండికించి వాడేస్తాము. దానివలన గుడ్డు లో పుట్టిన బ్యాక్టీరియా సజీవం గా ఉంటుంది. దానివల్ల అది విషపూరితము లేదా వివిద రకాల ఇంఫెక్షన్లకు కారణమవుతుంది. ఫ్రిజ్లో గుడ్లు నిల్వచేసే పద్దతిని అమెరికా నుండి ప్రపంచమంతా నేర్చుకుంది.
గుడ్లను ఫ్రిజ్లో ఉంచడం వలన అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. వాటిని బయట పెడితేకొద్ది రోజుల్లో నే పాడవుతాయని అమెరికా నుండి నేర్చుకున్నారు. అప్పటి నుండి ప్రపంచం మొత్తం ఈ పద్దతి ని అనుసరిస్తుంది. దాంతో రిఫ్రిజిరేటర్లలోనూ గుడ్లు నిల్వ చేయడం కోసం ప్రత్యేక అల్మారాలు ఏర్పాటుచేశారు.గుడ్లను ఎక్కువ సమయం బయట ఉంచడం మంచిదికాదు. అలా అని ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచడం కూడా సురక్షితం కాదు. మరి ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటున్నారా?
మీకు అవసరమైన గుడ్లను మాత్రమే కొనుక్కుని త్వరగా అంటే గుడ్లను తెచ్చిన రోజు నుంచి మూడు వారాల్లో గా వండేసుకోవడం మంచిది అని నిపుణులు అంటున్నారు. అవసరానికి మించి ఎక్కువ గుడ్లు కొని నిల్వ చేయడం మంచిది కాదని తెలియచేస్తున్నారు.