Love : ప్రేమతో బ్రతికేదే:
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు .మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అన్ని వృథానే. అదే ఆరోగ్యం ఉన్నవారు అయితే అడివిలోనైనా బ్రతికేయగలుగుతాడు . ఒక్క మనిషికే కాదు సృష్టి లో ఉన్న ప్రతిజీవికి ఇదే సూత్రము వర్తిస్తుంది.కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకోవాలి .ఎలాంటి రోగాలు రాకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలిపాటించాలి. ఏదైనా జబ్బు వచ్చింది అన్నవెంటనే , దానికి తగిన చికిత్స పొంది దాని అంతమొందించాలి.బ్రతికినంత కాలం హాయిగా ఆరోగ్యము గా ప్రేమతో బ్రతికేదే నిజమైన జీవితం. ఇక అసలు విషయానికి వస్తే మనుషుల మధ్య -ప్రేమ కాలం ఎంత?- అనేది తెలుసుకుని మన ప్రేమని రక్షించుకుందాం. ఇప్పుడు చెప్పా బోయే విషయాలు మనిషి కి ఒక అవగాహన కోసం చెప్పబడిన ప్రధమ చికిత్సలు మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణుల సలహాలు పాటించండి.
Love : జంటల మధ్య తలెత్తిన విభేధాలు:
మీరు ప్రేమలో ఉన్నారా? లేదంటే ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో మీకు తెలుసా? మీ రక్తంలో అనబడే ప్రేమ హార్మోన్ శాతం తెలుసుకుంటే అదితెలుసుకోవచ్చు అని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్ శాతం ఎక్కువగా కలిగి ఉన్న జంటలు చాలా కాలం పాటు కలిసి ఉన్నట్లు వారు చేసిన అధ్యయనంలోబయట పడింది అని ఇజ్రాయెల్‌కి సంబందించిన బార్-1 లాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలియచేసారు. కొత్తగా ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్ శాతం ఎక్కువగా కలిగి ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. అదే తక్కువ శాతం ఉన్న వారు మాత్రం విడిపోయారని ‘లైవ్‌సైన్స్’ తెలియచేసింది. జంటల మధ్య తలెత్తిన విభేధాలు సద్దుమణగడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు తెలియచేశాయి.
ఆక్సిటోసిన్ చికిత్స:
ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు కొనసాగడానికి ఆక్సిటోసిన్ చికిత్స చాలా అవసరమన్న వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే ప్రేమ బంధంలోనూ ఈ హార్మోన్ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం ప్రారంభ అయినా తొలినాళ్లలో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.