NewsOrbit
హెల్త్

ఎంత కాఫీ గుండెకు చెరుపు!?

చాలామందికి ఉదయాన్నే గ్లాసు కాఫీ కడుపులో పడాలి. లేకపోతే వారికి రోజు మొదలవ్వదు. మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాఫీ తాగే వారున్నారు. కాఫీ ప్రియులు ఎక్కువసేపు దానికి దూరంగా ఉండలేరు. ప్రపంచం మొత్తం మీద రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారని అంచనా. మరి ఎంత కాఫీ తాగవచ్చు? ఎంత దాటితే మంచిది కాదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఒక అధ్యయనంలో ప్రయత్నం జరిగింది.

కాఫీ సేవనం వల్ల పనిపై బాగా ఫోకస్ చేయగలరు. మెదడు ఆరోగ్యానికి కాఫీ మంచిదనీ, కాఫీ వల్ల మనిషి ఆయుర్దాయం పెరుగుతుందనీ, ప్రోస్టేట్ కాన్సర్ పెరుగుదలను అరికడుతుందనీ కూడా పరిశోధకులు అంటున్నారు. అయితే అన్ని ఆహార పదార్ధాలూ, పానీయాల మల్లేనే కాఫీ కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.

ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో వికారం వంటి స్వల్పకాలిక ఇబ్బందులు రావచ్చు. అయితే క్రమం తప్పకుండా ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఎంత ఎక్కువ తీసుకుంటే? అడిలైడ్‌లోని సౌత్ ఆస్ట్రేలియా యనివర్సిటీ సైంటిస్టులు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వీరి అధ్యయనం ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.

కాఫీలో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. కాఫీ తాగగానే శరీరం హుషారుగా తయారవడానికి ఇదే కారణం. శరీరం వేగంగా, బాగా పనిచేసేందుకు ఈ కెఫిన్ తోడ్పడుతుంది. ఇది ఎక్కువ అయిన పక్షంలో రక్తపోటు పెరుగుతుది. అధిక రక్తపోటు గుండె జబ్బుకు దారి తీస్తుంది.

సివైపి1ఎ2 అనే జన్యువులో ఒక ప్రత్యేకమైన రకం శరీరంలో ఉంటే తాగిన కాఫీ అరగడం నెమ్మదిగా జరుగుతుందని గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడీ నూతన అధ్యయనానికి దానిని ప్రాతిపదికగా తీసుకున్నారు. దాదాపు మూడున్నర లక్షల మందిని ఈ అధ్యయనంలో పరిశీలించారు.

సివైపి1ఎ2లో ప్రత్యేకమైన రకం జన్యువు శరీరంలో లేనివారిలో కూడా ఎక్కువ కాఫీ వల్ల గుండె జబ్బు ప్రమాదం పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజుకు ఆరు కప్పులు, ఆపైన తాగేవారిలో ఈ రిస్క్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. 75 మిల్లీగ్రాముల కెఫిన్ ఉన్న కాఫీ ఒక కప్పు కింద పరిగణించారు. కాబట్టి మీరు రోజుకు ఆరు కప్పులు తాగుతుంటే వెంటనే తగ్గించండి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment