వాముతో ఎంత ఆరోగ్యమో తెలుసా?

వాము.. దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ వాము గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. వాంతులు తగ్గాలంటే, వామును కొంచం తీసుకొని నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగాలి.

 

జ్వరంతో బాధ పడుతున్నప్పుడు వాము, జీలకర్ర, ధనియాలు మూడింటిని దొరగా వేయించి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గిపోతుంది.

ప్రతి రోజు భోజనానికి ముందు వాము, ఉప్పు, మిరియాలను సమభాగాలుగా కలిపి చూర్ణం చేసుకొని వాడుతుంటే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.

దంత వ్యాధులకు వాము బాగా ఉపయోగ పడుతుంది. వామును త్రిఫలాలు, కరక్కాయ, ఉసిరికాయ, తనికాయలతో కలిపి చూర్ణం చేసి దానిని నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.

వాముతో తయారు అయినా నూనె వాత వ్యాధులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

గొంతు నొప్పితో బాధపడేవారు వామును నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

వామును తేనె తో కలిపి ఒక వారం రోజులు తీసుకుంటే మూత్ర పిండాలలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.

బాలింతలు వామును వాడడం వల్ల చను పాలు బాగా పెరుగుతాయి.

వాము పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు, మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.

వాము, బెల్లం కలిపి తీసుకుంటే అస్తమాను కంట్రోల్ చేయవచ్చు.

వాము గుండె వ్యాధులు, రాకుండా సహాయపడుతుంది. ఇంకా కీళ్ల నొప్పుల ను కూడ తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నవాళ్లు వామును తమల పాకులో వేసుకొని నమిలితే తగ్గిపోతాయి.