నోరు శుభ్రం గా ఉండాలంటే రెండు పూటలా బ్రష్ చేసుకోవడంఅవసరమని తెలిసిన విషయమే. అయితే, నోరు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి బ్రష్ ను వాడుతున్నాం అన్న విషయం కూడా అవసరం అని మర్చిపోరాదు. కానీ, బ్రష్ ఎంపిక లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బ్రషింగ్ చేయడం ఇంకా బావుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ఉదయంలేచిన తర్వాత , రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. కేవలం బ్రష్ చేసుకోవడం తో మాత్రమే దంతాలుమొత్తం శుభ్రం అవ్వవు. పళ్ల మధ్య ఉండే చిన్న,చిన్నకాళీలలోకి, దవడ చివర ఉండే పన్నువరకు బ్రష్ వెళ్లే అవకాశం తక్కువ. అందువల్ల ఫ్లాసింగ్, మౌత్వాష్ వంటివి ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఆరునెలలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి.
దంతాలను రోజుకు కనీసం రెండు సార్లు తోముకోవాలి హడావుడి గా కాకుండా నిదానంగా పళ్ళను తోముకోవాలి. మెత్తటి టూత్ బ్రష్ ను , ఫ్లొరైడ్ టూత్ పేస్టును, వాడాలి. పళ్ళను తోమడానికి సరైన పద్దతి ని అవలంబించండి. పళ్ళ మీద బ్రష్ ను కొంచెం ఏటవాలుగా ఉంచి , కొద్ది దూరం ముందుకీ వెనక్కీ కదుపుతూ బ్రష్ చేసుకోవాలి. పళ్ళ పైనా , లోపలి వైపూ, మరియూ నాలుక మీదా బ్రష్ చేయడం చాల అవసరం . చిగుళ్ళు దెబ్బతినేటట్టు లేదా మరీ గట్టిగా బ్రష్ చేయకూడదు.
ఎక్కువ సమయం పాటు బ్రష్ చేయకుండా కేవలం రెండు ,మూడు నిమిషాలు సున్నితం గా బ్రష్ చేస్తే చాలు.పేస్ట్ వేసుకునే ముందు బ్రష్ ని 20 సెకన్ల పాటు కొంచెం వేడిగా ఉన్న నీటిలో పెట్టి ఉంచాలి.. బ్రష్ గాలి తగిలే చోట ఉంచాలి. బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసే ప్రతి సరి బ్రష్ ని ఒకసారి నీళ్ళతో కడగాలి. ఒక బ్రష్ వాడడం మొదలు పెట్టిన మూడు లేదా నాలుగు నెలలకి మరొక కొత్త టూత్ బ్రష్ నుమార్చుకోవాలి.