చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తేనెను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తేనె తినడానికి తియ్యగా చాలా రుచికరంగా ఉంటుంది ఈ తేనెను ఆహారం, పానీయాలలో చక్కెరకు బదులుగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. నిజానికి తేనెని ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో అన్ని రకాల ఆహారపదార్ధాలు కూడా కల్తీ చేసేస్తున్నారు.
కల్తీ తేనె గుర్తు పట్టడం ఎలా?
అలా కల్తీ చేసిన ఆహారపదార్ధాలను గుర్తించడం కూడా కష్టం అయిపోతుంది. అలా కల్తీ అయిన ఆహారం తింటే లేని పోని అనారోగ్యాలు వస్తాయి.అయితే తేనె కూడా కల్తీ చేస్తున్నారు అని మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి స్వచ్ఛంగా ఉంటే తేనెలోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మనం తినేది నిజమైన తేనె అని అని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..కల్తీ తేనెని ఏ విధంగా గుర్తుపట్టాలో తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి తేనెను గుర్తించే టిప్స్ :
టిష్యూ పేపర్ పరీక్ష తేనె యొక్క స్వచ్ఛతను తెలుపుతుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపై తేనె వేయాలి. ఒకవేళ అది నిజమైన తేనె అయితే అది టిష్యూ పేపర్‌పై అలాగే ఉంటుంది. అలా కాకుండా నకిలీదైతే ఆ టిష్యు పేపర్ పై ఇంకడం కానీ ఆ ప్రదేశంలో మచ్చలా ఏర్పడటం కానీ జరుగుతుంది.అలాగే మరొక టిప్ ఏంటంటే మీ బొటనవేలు, చూపుడు వేలు మధ్య కొద్దిగా తేనె తీసుకొని రఫ్ చేయండి.ఆ తేనె గమ్ మాదిరి దగ్గరికి, దూరంగా లాగినప్పుడు తీగల మాదిరి సాగాలి. ఇలా అయితే అది నిజమైన తేనే అని అర్థం చేసుకోండి. నకిలీ తేనె అలా సాగదు.. కిందకు కారిపోతుంది.ఇక మరొక పద్ధతి ఏంటంటే ఒక బల్లపై కొద్దిగా పత్తి వేసి దానిపై తేనె వేసి కాల్చాలి. పత్తి వెంటనే కాలిపోతే తేనెలో కల్తీ లేదని అర్థం. అలా కాకుండా ఎక్కవ సేపు వెలుగుతుంటే అది కల్తీ అని అర్ధం.!