Nail care: మనం పైకి కనిపించడానికి ఆరోగ్యంగా ఉన్నాగాని మన లోపల ఎటువంటి అనారోగ్యాలు దాగిఉన్నాయి అనేది మనకు తెలియదు. కానీ మన చేతి గోళ్లను ఆధారంగా చేసుకుని మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.అందరి చేతులకు ఉన్న గోళ్లు అన్ని ఒకేలాగా ఉండాలని లేదు.కొందరి గోళ్ల మీద తెల్ల గీతలు ఉంటే మరికొందరు గోళ్లు తెల్లగా పాలిపోయినట్టు ఉంటాయి.అయితే మనఅందరి చేతి గోళ్ల మీద అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది దానిని ఎప్పుడన్నా గమనించారా..దానిని లునులా అని అంటారు.కొందరిలో ఈ లునులా పెద్దగా ఉంటే మరికొందరిలో మాత్రం చిన్నగా ఉంటుంది. అసలు కొందరిలో అయితే కనిపించదు.నిజానికి మన గోళ్లను చూసి మనకు రాబోయే వ్యాధులను కూడా చెప్పవచ్చు.అదెలాగానో తెలుసుకుందామా..!!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చేతి గోళ్ళ మీద లునులా భాగం లేకపోతే?
ఒకవేళ చేతి గోళ్ల మీద లునులా భాగం కనుక లేకపోతే వారు పౌష్టికాహార లోపం, థైరాయిడ్ గ్రంథి లోపాలతో పాటుగా రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం. అలాగే లునులా భాగం లేకపోతే అతిగా బరువు పెరగడం, జుట్టు రాలడంవంటి సమస్యలను కూడా ఎదురుకునే ప్రమాదం ఉంది. అలాగే ఎవరికైతే లునులా భాగం అనేది పెద్దగా ఉంటుందో వారు ఆరోగ్యంగా ఉన్నారన్నమాట. అలాగే వారి యొక్క జీర్ణశక్తి, థైరాయిడ్ గ్రంథులు పని తీరు బాగున్నాయని అర్ధం..ఒకవేళ ఈ లునులా అనేది నీలి రంగులో ఉన్నాగాని లేదంటే తెల్లగా పాలిపోయినట్టు ఉంటే వారు త్వరలోనే షుగర్ వ్యాధి రాబోతుందని గ్రహించాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లునులా చిన్నదిగా ఉంటే ఎలాంటి వ్యాధులకు సంకేతం :
ఈ లునులా బాగా మరి చిన్నగా ఉంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని అర్ధం. అలాగే వారి శరీరంలో వ్యర్థ పదార్ధాలు ఎక్కువగా పేరుకుపోయాయని అర్ధం. అలాగే వారి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా ఇబ్బందులు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి.అలాగే కొందరిలో గోళ్ల మీద తెల్లని గీతలు కనిపిస్తాయి.ఇలా గీతలు కనబడితే వారి యొక్క శరీరంలో కాల్షియం, జింక్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. వాస్తవానికి మన చేతికి ఉన్న పదివేళ్లల్లో కనీసం ఎనిమిది వేళ్లకు లునులా అనేది కనిపించాలి. అలా ఎనిమిది కంటే తక్కువగా లునులా ఉంటే వారిలో విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం ఉందని తెలుసుకోవాలి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గోళ్ళ రంగు ఇలా ఉంటే యమా డేంజర్ తెలుసా..?
ఒకవేళ మీ గోళ్లు కనుక పింక్ కలర్ లో కాకుండా పాలిపోయినట్టుగా ఉంటే మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయని అర్థం.అలాగే గోర్లు పసుపు రంగులో ఉంటే వారు ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తెలుసుకోవాలి.సాధ్యమైనంత వరకు గోళ్ళకు ఎక్కువగా నెయిల్ పాలిష్ లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది.అలాగే కొందరి గోర్ల మీద నల్లని పొడవైన గీతలు కనిపిస్తాయి.ఇలా గీతలు ఉంటే కనుక అవి చర్మ క్యాన్సర్ కు సంకేతం అని తెలుసుకోవాలి.ప్రతిరోజు వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ గోళ్ళ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి