Cucumber drink: ఈ కాలంలో చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవన శైలి కారణాల వలన చాలా మంది బరువు పెరిగిపోతున్నారు ఫలితంగా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం శున్యం అని చింతిస్తున్నారా.. అయితే మేము చెప్పే ఈ చిట్కాను ఒక్కసారి ట్రై చేసి చుడండి.సులభముగా కొద్ది రోజుల్లోనే మీరు బరువు తగ్గుతారు.నిజానికి శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు శరీరాన్ని డిటాక్సిఫై చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే శరీర బరువును తగ్గించడానికి దోసకాయతో చేసిన డ్రింక్ తాగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. దోసకాయ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కావున దోసకాయతో తయారు చేసిన డిటాక్స్ డ్రింక్ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. మరి ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..ముందుగా ఈ
ఈ డ్రింక్‌కు కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దామా..:
నీరు-1లీటర్
దోసకాయలు-3
నిమ్మకాయలు -4
పుదీనా ఆకులు-కొద్దిగా
ముందుగా దోసకాయలను తీసుకుని వాటి మీద ఉన్న తొక్కను తీసేసి సన్నని ముక్కలుగా కోసుకోవాలి.అలాగే పుదీనా ఆకులను కడిగి సన్నగా కోసుకోవాలి. వీటితో పాటు నిమ్మకాయలను కూడా సన్నగా కోయాలి.ఇప్పుడు ఈ మూడింటింటిని ఒక జగ్గు నీళ్లలో వేసి బాగా కలపాలి..ఇప్పుడు ఆ నీటిని కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ వాటర్ కాస్త చల్లబడ్డాక ఫ్రిడ్జ్ లో నుంచి తీసి తాగాలి.ఇలా తయారుచేసుకున్న డిటాక్స్ డ్రింక్ ను రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఇదే విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా డిటాక్స్ వాటర్ తాగితే సులభంగా బరువు తగ్గుతారు.మరి ఆలస్యం. చేయకుండా బరువు తగ్గాలని భావించేవారు ఈ డిటాక్స్ డ్రింక్ ను ఒకసారి ట్రై చేసి చుడండి.
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…