NewsOrbit
హెల్త్

పిల్లలు సరిగ్గా చదవడం లేదా ?? ఇది కారణం కావచ్చు .. !

పిల్లలు సరిగ్గా చదవడం లేదా ?? ఇది కారణం కావచ్చు .. !

ఈరోజుల్లో పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ మరియు మొబైల్ లో  గేమ్స్ ఆడడానికి లేదా టీవీ ముందు కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల వాళ్ల మైండ్ ఎదగదు. పైగా శారీరక ఎదుగుదల ఉండదు. మీ పిల్లలని వీటికి దూరంగా ఉంచండి.

పిల్లలు సరిగ్గా చదవడం లేదా ?? ఇది కారణం కావచ్చు .. !

పిల్లలకి ఎపుడు మానసిక, శారీరక ఎదుగుదల ఉండే గేమ్స్ ఆడించాలి.తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే , మీ పిల్లలని ఎంత సేపు చదువు మీద మాత్రమే ఫోకస్ చేయించకూడదు. వాళ్ల ఇష్టాలని తెలుసుకొని ,ప్రోత్సహించాలి.వాళ్లు ఏ రంగం లో వెళ్ళాలి అని  అనుకుంటున్నారో తెలుసుకొని, చదువుతో పాటు దానిలో కూడా ప్రోత్సహించాలి.  చదువుకుంటేనే జీవితం లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే భ్రమనుండి బయట పడండి . జీవితం లో చదువు చాల అవసరమే కావచ్చు,కానీ పిల్లలు ఆటలు, సంగీతం, డాన్స్ ,చిత్రలేఖనం ఇలా వేరువేరు కళలలో శ్రద్ధ చూపిస్తుంటే మాత్రం మీరు తప్పకుండ వారిని ప్రోత్సహించండి . చదువుకుంటే వారికీ ఇష్టమైనవి నేర్చుకోవచ్చని వారికీఅర్ధం అయ్యేలా చెప్పండి…అలా చేయడం వలన వారిలో ఎంతో ,కొంత మార్పువస్తుంది.

చాల మంది తండ్రులు పిల్లల బాధ్యత అసలు పట్టించుకోరు. అదికేవలం తల్లి బాధ్యత మాత్రమే అన్నట్టు ఏమి పట్టించుకోరు. వాళ్ల బిజినెస్ వ్యవహారాలు ఉద్యోగ భాద్యతలు ఎక్కువ అనుకుంటారు.అసలు వాళ్ల పిల్లలు ఎం చదువుతున్నారు,ఎలా  ఉంటున్నారు,  ఎలాంటి పనులు చేస్తున్నారు,ఇవిఎమి పట్టించుకోరు. పిల్లలా బాధ్యత ఏఒక్కరిదో కాదు అని తెలుసుకోవాలి.ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పిల్లలని దగ్గరకి తీసుకోని ఎం చదుతున్నారు? ఈరోజు ఏమి చేశారు ?స్కూల్  లో  విషయాలు  అడిగి  తెలుసుకుంటే ,వారు ఎంతో సంతోష పడతారు . అంతే కాకుండా  వాళ్ళని  ట్యూషన్స్ మీద  వదిలేయకుండా ప్రతి  రోజు మీరు దగ్గర ఉండి వారిని చదివించినట్లయితే, పిల్లలు ఏ సబ్జెక్టు లో వెనుకబడి ఉన్నారనేది  తల్లి దండ్రులకు  తెలుస్తుంది . దానివలన వారికీ అర్ధమయే   రీతిలో పిల్లలకు వివరించడం జరుగుతుంది . స్కూల్లో అందరితో పాటు నేర్చుకున్న పాఠాలు ఇంటిలో మళ్ళి పిల్లల తో  ప్రత్యేకంగా చదివించడం వలన, వాళ్ళు ఎంతో ప్రతిభగలవాళ్లుగా  తయారవుతారు.పాఠాలలో వారికీ అర్ధం కానీ అంశాన్ని రక రక లా  చార్ట్లులేదా ఇంటర్ నెట్  లో దొరికే  వీడియోస్ తో ఆశక్తి కరంగా వివరించే ప్రయత్నం చేయాలి . ఇంత టైం మాకు ఎక్కడిది అంటారా ?వాళ్ళ భవిష్యత్తు బాగుకోసం కావలిసింది మీ సంపాదన కాదు, మీ సమయం అని మాత్రం మర్చిపోకండి .  ప్రతి ఆదివారం వాళ్లని బయటకి తీసుకువెళ్లి రకరకాల ప్రదేశాలు చూపించాలి.  దింతో మీ మీద పిల్లలకి ప్రేమ పెరుగుతుంది. మీరు ఎలా  చెబితే ఆలా నడుచుకుంటారు. అప్పుడు వారు చదువు మీద ఎక్కువ ఆశక్తి చూపించే అవకాశం ఉంది .

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ సమయం చదువుతున్నప్పటికీ తక్కువ మార్కులు వస్తున్నాయని చెబుతూ ఉంటారు. తమ పిల్లలకు చదువుపై ఏకాగ్రత కుదరటం లేదని చెబుతూ ఉంటారు. మరి విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నవి ఏంటి….? అనే ప్రశ్నకు నీల్సన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్‌ వస్తువులు విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయని ఈ సర్వేలో ప్రధానంగా మారింది. కాబట్టి పిల్లలు వాటిని హద్దుదాటకుండా వాడేటట్టు చూడలిసిన భాద్యత ప్రతి తల్లి దండ్రులమీద ఉంది . తల్లిదండ్రుల కీచులాటలు కూడా పిల్లల పైన ప్రభావం చూపుతాయి అని నిపుణుల చెప్తున్నా మాట.పిల్లల ముందు కలహించు కోవడం వలన వారు మానసికంగా ఆందోళన చెంది మరపునకు గురి అవడం మరియు హైపర్ ఆక్టివ్ గా మారడం జరుగుతువుంటుంది .ఆ ప్రభావం వారి చదువుని కూడా దెబ్బ తీస్తుంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లల ముందు గొడవపడకుండా వారికీ ప్రశాంతమైన వాతావరణం  కల్పించడం అనేది అన్నిటి కన్న ప్రధానమైన  అంశము గా తల్లిదండ్రులు గుర్తించాలి అని మానసిక వైద్య  నిపుణులు చెప్తున్నా మాట .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri