ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక బరువు వలన లేనిపోని అనారోగ్య సమస్యలు దరి చేరతాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉండాలిసిన దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిస్తే వెంటనే మీ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. లేదంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.మరి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలి అనుకుంటున్నారా.. ఎలాగంటే ఒకపక్క ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూనే మరోపక్క మెడికేషన్, ఎక్సర్సైజ్లు చేస్తూ మీ శరీర బరువును తగహించుకోవాలి.ముఖ్యంగా తినే తిండి విషయంలో జాగ్రత్తలు వహించాలి.ఎందుకంటే కొన్ని రకాల వస్తువులు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.మరి ఆ ఆహార పదార్ధాలు ఏంటో చూద్దామా
మాంసం :
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్టే..!
మనలో చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. అయితే ఈ మాంసంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని రకాల మాంసాల్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగవచ్చు.
స్వీట్స్, తీపి పదార్ధాల వలన :
స్వీట్స్, యాడెడ్ షుగర్ వస్తువులు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువ అవుతుంది. యాడెడ్ షుగర్ కంటే ఏవన్నా పండ్లు తినడం చాలా మంచిది.స్వీట్స్, అలాగే నెయ్యి ఎక్కువగా వాడకూడదు.
బరువు పెరగకుండా ఉండాలంటే తీసుకోవలిసిన జాగ్రత్తలు :
అలాగే శాచ్యురేటెడ్ ఫ్యాట్ వస్తువుల్ని డైట్లో తగ్గించుకుంటూ ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాల్ని తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఆహారంలో ఓట్స్, బార్లీ, యాపిల్, బీన్స్, చియా సీడ్స్ చేర్చుకోవాలి. . డైట్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోకుండా హెల్తీ ఫ్యాట్ మాత్రం తీసుకోవాలి. నట్స్ ఆవకాడో, సీడ్స్ డైట్లో ఉండాలి. ఇక కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మీ డైట్లో బ్రోకోలి, కాలిఫ్లవర్ వంటి క్రూసిఫెరోస్ కూరగాయలు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి సీజన్ గా దొరికే పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. తిండితో పాటుగా శరీరానికి కూడా తగినంత వ్యాయామం అందేలా చూసుకోవాలి.