NewsOrbit
హెల్త్

లవ్ బైట్స్‌తో ఇబ్బందిగా ఉందా!?

ఆలుమగలు శృంగారంలో మునిగితేలుతున్నపుడు ఉద్రేకాలు తారస్థాయికి వెళ్లడం సహజం. ఈ స్థితికి చేరినపుడు కూడా అందరూ మృదువుగా ఉంటారని అనుకోనక్కర లేదు. చాలామంది భాగస్వామితో కాస్త మొరటుగా వ్యవహరించడం కద్దు. అలా మొరటుగా ప్రేమించినపుడు ఎదుటివారి శరీరంపై కొన్ని గుర్తులు మిగిలిపోతాయి…లవ్ బైట్స్. చర్మం కమిలిపోయి ఆ గుర్తు కొన్ని రోజుల పాటు ఉండిపోతుంది.

చాలా ఎక్కువ వత్తిడితో చుంబించినపుడు, దంతాలతో అధరాలతో కొరికినపుడు ఈ లవ్ బైట్స్ ఏర్పడతాయి. అక్కడ చర్మం కింద సూక్ష్మ రక్తనాళాలు పగిలి రక్తం బయటకురావడమే లవ్ బైట్. నిజానికి ఇవి కూడా గాయాలే. వైద్య పరిభాషలో వీటిని హికీస్ అంటారు. హికీస్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే మెడపై ఏర్పడినవే కాస్త ఎక్కువ ఇబ్బంది పెడతాయి.

రాత్రి పడకగది ఏకాంతంలో క్రీడించినపుడు తెలియదు కానీ ఈ హికీస్‌తో ఉదయం ఇంట్లో అందరి కంటా పడడం ఇబ్బందిగానే ఉంటుంది. వీటిని ఏం చేయగలం? వాటిని తక్షణం పోగొట్టడం కుదరదు కానీ కొన్ని వంటింటి చిట్కాలతో తీవ్రత తగ్గించవచ్చు.

ప్రాధమిక చికిత్స

హికీస్ ఏర్పడిన చోట ఐస్ ప్యాక్‌తో కాపడం పెట్టాలి. చర్మంపై ఐస్‌ను నేరుగా తాకించకూడదు. 15- 20 నిముషాల సేపు ఐస్ ప్యాక్‌తో కాపడం పెట్టాలి. మరీ వాపు కనబడి నెప్పిగా ఉంటే ఐబూఫ్రొఫెన్ లాంటి టాబ్లెట్ వాడవచ్చు.

ఆర్నికా

ఆర్నికా మొక్క నుండి తయారయ్యే ఈ ఔషధాన్ని నెప్పులు, వాపులు, గాయాలకు మందుగా వాడడం ఎప్పటినుంచో ఉంది. హోమియోలో ఈ ఔషధం వాడకం ఎక్కువ. ఇది లేపనం రూపంలో గుళికల రూపంలో దొరుకుతుంది. 20 శాతం ఆర్నికా జెల్ కానీ, ఆయింట్‌మెంట్ కానీ తీసుకుని అక్కడ రాస్తే ఫలితం ఉంటుంది.

విటమిన్ కె

రక్తం గడ్డకట్టిన సందర్భాలలో, గాయాలు మానడంలో విటమిన్ కె పాత్ర ఎంతైనా ఉంటుంది. విటమిన్ కె లోపం చాలా అరుదయినప్పటికీ అలాంటి లోపం ఉంటే గాయాల ప్రమాదం పెరగడం, వాటి నుంచి రక్తం కారడం అంత త్వరగా ఆగకపోవడం జరుగుతుంది. హికీస్ ట్రీట్‌మెంట్‌కు కూడా విటమిన్ కె వాడవచ్చు. విటమిన్ కె ఆయింట్‌మెంట్‌ అక్కడ పూసినందువల్ల కాస్త గుణం కనబడుతుంది.

పాలకూర, బ్రోకోలి వంటి ఆకుకూరలు, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, సోయాబీన్, కనోలా వంటి వనస్పతి నూనెలు, బ్లూబెర్రీ, ద్రాక్ష, అంజూర వంటి పళ్లలో విటమిన్ కె ఎక్కువగా దొరుకుతుంది.

విటమిన్ సి

గాయాలు మానాలన్నా, చర్మం, రక్తనాళాలు, మృదులాస్తి ఆరోగ్యకరంగా ఉండాలన్నా శరీరంలో కొలాజెన్ అనే ప్రొటీన్ కావాలి. ఆ కొలాజెన్ తగినంత తయారుకావాలంటే విటమిన్ సి కావాలి. గాయం అయిన చోట విటమిన్ సి పూస్తే త్వరగా మానుతుందని అంటారు. అయితే దీనిని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవు. హికీస్‌పై రాయాలనుకుంటే విటమిన్ సి క్రీములు దొరుకుతాయి.

సహజసిద్ధంగా కావాలంటే నిమ్మ జాతి పళ్లు, మిరప, మిరియాలు, కివి పళ్లు, బ్రోకోలి, టమోటాలు విటమిన్ సి కావాల్సినంత అందిస్తాయి.

 

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment