Kids care: పసిపిల్లలకు ఆకలి వస్తే ఏడవడం తప్పా వాళ్లకు ఏమి తెలియదు. అయితే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఏది పడితే అది పెట్టి కడుపు నిండిపోయింది కదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే. అయితే నిజానికి పిల్లలకు పెట్టే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఎదిగే పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.పిల్లలు ఆరోగ్యంగా,దృడంగా ఎదగాలంటే వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి. అప్పుడే పిల్లలు శారీరకంగా,మానసికంగా కూడా ఎదుగుతారు.అయితే కొందరు పిల్లలు ఏది పడితే అది తనరు. అది తినను… ఇది తినను అని మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు.అయితే పిల్లల ఇష్టాన్ని గ్రహించి వారికి నచ్చిన ఆహారాన్ని పిల్లలకు బుజ్జగించి మరి తినిపించాలి. మరి ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహరం పెడితో మంచిదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!
పిల్లల ఎదుగుదలలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. పెరుగులో ఎన్నో రకాల విటమిన్స్, కాల్షియం, ప్రొబయోటిక్స్, ప్రొటీన్స్ ఉంటాయి. పిల్లలు కూడా పెరుగును చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.పెరుగు తింటే జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.ఎముకలను, దంతాలను బలంగా చేస్తుంది. పెరుగు తినని పిల్లలకు మజ్జిగ రూపంలో అయినా తాగిస్తే ఆరోగ్యానికి మంచిది.
పప్పు, నెయ్యి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.పప్రోటీన్స్,విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా సమకులంగా లభిస్తాయి ఈ పప్పు అన్నంలో.పిల్లలకు ఎప్పటికప్పుడు సీజనల్ గా దొరికే పండ్లను పెడుతూ ఉండాలి.చక్కెర లేకుండా తాజా పండ్లను రసాల రూపంలోగాని, మిల్క్ షేక్ రూపంలోనూ పిల్లలకు అందిస్తే మంచిది. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
ఈ వేసవి కాలంలో పిల్లలకు కొబ్బరి నీళ్లు పట్టడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అలాగే పిల్లలకు నిమ్మరసం కూడా తాగిస్తూ ఉంటే చాలా మంచిది. నిమ్మకాయలో ఉండే సి విటమిన్ వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..పిల్లలకు వివిధ రకాల కూరగాయలు, పండ్లుతో సూప్‌లు చేసి తాగిస్తూ ఉండాలి. పిల్లలకు నచ్చని ఆహారాన్ని పెట్టే బదులు వారు ఇష్టంగా తినే ఆహారాన్నే రోజులో కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు ఎదిగే వయసులో చాకెట్ల్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్, స్టోరేజ్ ఫుడ్ లను ఎక్కువగా అలవాటు చేయకుండా ఉంటే మంచిది..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…